Band Melam: మీ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి.. బ్యాండ్ మేళం ఈవెంట్ లో తమన్ కామెంట్స్ వైరల్
Band Melam Movie

Band Melam: ‘మీ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి’.. బ్యాండ్ మేళం ఈవెంట్ లో తమన్ కామెంట్స్ వైరల్

Updated on: Feb 24, 2026 | 8:30 PM

‘కోర్ట్’ తో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించిన రెండో సినిమా బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బ్యాండ్ మేళం టీజర్ లాంఛింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

 

 

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన ‘బ్యాండ్ మేళం’ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవిల పెయిర్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కపుల్‌ను చూసి మురిసి పోయిన తమన్.. సరదాగా “మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది, కానీ ఆ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడ ఫిజిక్స్ కాకుండా చూసుకోండి” అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పంచ్ వేశారు. అయితే ఇది ఎక్కడ నెగటివ్ మీనింగ్‌లోకి వెళ్లి వైరల్ అవుతుందో అని వెంటనే రియలైజ్ అయిన తమన్.. తన మాటలను సర్దుకుంటూ.. నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా.. మీరిద్దరూ భవిష్యత్తులో గొడవలు పడకండి అని మాత్రమే చెబుతున్నా. మీ పెయిర్ చూడటానికి చాలా బాగుంది, ఎప్పుడూ ఇలాగే కలిసుండండి’ అంటూ క్లారిటీ ఇచ్చి వాతావరణాన్ని కూల్ చేశారు. అంతటితో ఆగకుండా ‘అసలే నేను ఐదో తరగతి ఫెయిల్ అయ్యాను.. నాకేం పెద్దగా తెలియదు’ అంటూ తనదైన స్టైల్లో అమాయకత్వం నటిస్తూ స్పీచ్ ముగించేసారు. ఈ మధ్య కొన్ని ఈవెంట్స్‌లో సెలబ్రిటీస్ మాట్లాడుతున్న మాటలు ఇలాగే వైరల్ అవుతున్నాయి

Thaman Comments In Band Melam Movie Teaser Launch, Watch Video
Band Melam Movie, Band Melam Movie Event, Band Melam Movie Release, Thaman, Tollywood, Tollywood News, Bollywood, Telugu Cinema news, Telugu Movie News, Telugu Film News, Tollywood, Telugu news, Telugu Latest News,

Published on: Feb 24, 2026 08:29 PM
Follow Us