ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే

Updated on: Apr 03, 2026 | 3:42 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా, హీరోయిన్ వాణి భోజన్ సంచలన ప్రకటన చేసింది. దళపతి విజయ్ కొత్త పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కళగం)కి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని స్వాగతించిన ఆమె, అవకాశం వస్తే టీవీకేలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో తన మద్దతు విజయ్‌కే అని తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. DMK, అన్నాDMK వంటి ప్రధాన పార్టీలతో పాటు హీరో దళపతి విజయ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచాడు. టీవీకే పార్టీ తరఫున ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు విజయ్. మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ వాణి భోజన్‌ తన మద్దతు టీవీకే అధినేత విజయ్‌కే అని ప్రకటించడం.. ఇప్పుడు కోలీవుడ్‌ లో వైరల్ టాపిక్ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలపై స్పందించింది. ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు వాణి భోజన్ ఇలా ఆన్సర్ ఇచ్చింది. ‘నేను హీరో విజయ్ దళపతికి వీరాభిమాని. ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో విజయ్ తో నటించే అవకాశం నెరవేరలేదు. అయితే ఆయన రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. విజయ్‌ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషకరం’ అని వాణీ భోజన్ చెప్పుకొచ్చింది. ఇక టీవీకే విజయ్ పార్టీలో చేరే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు కూడా వాణీ భోజన్ ఆన్సరిచ్చింది. తనకు విజయ్ అంటే అభిమానమని.. అవకాశం వస్తే ఆయన పార్టీలో కచ్చితంగా చేరతానంటూ చెప్పుకొచ్చింది. ఎవరేమనుకున్నా ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్‌కే అంటూ తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది

Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు

Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Loading...
Unable to load recommendations.
Follow Us