అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలి ప్రాజెక్టుల విషయంలో నెమ్మదించారని, కూలీ సినిమా పరాజయం తర్వాత ఆయన తదుపరి అడుగులు జాగ్రత్తగా వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ 2 షూటింగ్ నెమ్మదిగా సాగుతుండగా, తలైవా 173కి దర్శకులు మారుతున్నారు. కమలహాసన్‌తో మల్టీ స్టారర్ కూడా ఆలస్యం కానుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలి కాలంలో తన సినిమా ప్రాజెక్టుల విషయంలో అనుహ్యంగా నెమ్మదించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు ప్రకటించి, వాటిని పట్టాలెక్కించిన తలైవా, ప్రస్తుతం ‘స్లో అండ్ స్టడీ’ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు ముందు ఓకే అన్న దర్శకులు కూడా ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ‘కూలీ’ సినిమా ఫలితమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కూలీ’ విడుదల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ సినిమా పరాజయం పాలవడంతో రజినీకాంత్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘జైలర్ 2’ షూటింగ్ కూడా నెమ్మదిగా సాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్!
ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్
షారుఖ్ ప్లేస్‌ని రణ్‌వీర్ కొట్టేస్తారా?
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు
Follow Us
