Anchor Varshini: క్రిస్టియానో​ రొనాల్డో‌తో తెలుగు యాంకర్ ఫన్నీ వీడియో.. అమ్మడి వేశాలు మాములుగా లేవంటోన్న నెటిజన్లు..!

|

Jul 14, 2021 | 6:01 PM

బుల్లితెరపై వర్షిణి అప్పుడప్పుడు సందడి చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుటోంది. సోషల్ మీడియాలోనూ తన హాట్ హాట్ ఫొటోలను విడుదల చేస్తూ.. నెటిజన్లను అలరిస్తోంది.

Anchor  Varshini: క్రిస్టియానో​ రొనాల్డో‌తో తెలుగు యాంకర్ ఫన్నీ వీడియో.. అమ్మడి వేశాలు మాములుగా లేవంటోన్న నెటిజన్లు..!
Anchor Varshini With Ronaldo
Follow us on

Anchor Varshini: బుల్లితెరపై వర్షిణి అప్పుడప్పుడు సందడి చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుటోంది. సోషల్ మీడియాలోనూ తన హాట్ హాట్ ఫొటోలను విడుదల చేస్తూ.. నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో​రొనాల్డో‌తో ఓ ఫన్నీ వీడియోను చేసి ఇన్‌స్టాలో రచ్చ చేసింది. ఆమధ్య రొనాల్డో విలేకర్ల సమావేశంలో మాట్లాడే ముందు.. కోకాకోలా బాటిళ్లను పక్కన పెట్టిన విషయం గుర్తుంది కదా. ఆ టైంలో ఈ స్టార్ ఆటగాడిపై సోషల్ మీడియాలో మీమ్స్‌ ఫెస్ట్‌ చేసి నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. అలాగే ఓ యూజర్ ఈ ఎపిసోడ్‌ను అద్బుతంగా ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. దీనికి వర్షిని తన స్టైల్‌లో యాక్టింగ్ చేసి తన ఫ్యాన్స్‌ను నవ్విస్తోంది. వర్షిని చేసి వీడియోకు కామెంట్లు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ఈ ఫన్నీ వీడియోలో ఏముందంటే.. తెలుగు యాంకర్ వర్షిని.. స్మార్ట్ టీవీ తెరపై రోనాల్డో తో మాట్లాడుతున్నట్లు క్రియోట్ చేసింది. బాగా ఆకలేస్తుందని, రోనాల్డోకు కోకాకోలా బాటిళ్లను ఇవ్వాలని సైగ చేసింది. దీంతో రోనాల్డో ఆ బాటిళ్లను తనకు ఇచ్చినట్లుగా టీవీ వెనుక నుంచి ఆ బాటిళ్లను అందుకుంది. ఆ బాటిళ్లను తనకోసమే ఇచ్చినట్లు వీడియోలో చూపించింది. దాంతో నెటిజన్లు కూడా ఆమెకు అదే రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తే.. మరికొందరు సిరీయస్‌గా కామెంట్లు చేశారు. నువ్వు సూపర్ అంటూ కొందరు, బాగా చేశావ్ అంటూ మరికొందరు కామెంట్ చేయగా, టీవీలో నవ్వించమంటే చేతకాదు.. ఇన్‌స్టాలో మాత్రం కుమ్మేస్తున్నావ్ అంటూ కామెంట్లు చేశారు.

రొనాల్డో విలేకరుల సమావేశంలో.. తన ముందు ఉంచిన రెండు కోక్ బాటిళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఆ బాటిళ్లను అక్కడి నుంచి తీసేశాడు. వాటికి బదులు వాటర్ బాటిల్ చూపిస్తూ గట్టిగా వాటర్ అంటూ అరిచాడు. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది. రొనాల్డో చర్య తర్వాత కోకాకోలా మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. ఈ సంఘటన తర్వాత కోకాకోలా ఒక ప్రకటనలో “ప్రతి ఒక్కరూ తమ డ్రింక్‌ను ఎంచుకునే అర్హత ఉందంటూ… ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిరుచులు, అలాగే అవసరాలు ఉంటాయని ” రాసుకొచ్చింది.

 

Also Read: తెలంగాణలో 3 కోట్ల ట‌న్నుల ధాన్యం ఉత్ప‌త్తి.. రెండో రోజు కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

కత్తి మహేష్ మృతి కేసులో మరో ట్విస్ట్.. టీవీ9తో ఆసక్తికర విషయాలు చెప్పిన కత్తి మహేష్ కారు డ్రైవర్