పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Updated on: Mar 18, 2026 | 6:30 PM

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సినిమా పైరసీని అరికట్టేందుకు కొత్త ఫార్ములాతో ముందడుగు వేసింది. టాలీవుడ్‌కు ఏటా ₹3,700 కోట్ల, భారతీయ సినీ పరిశ్రమకు ₹22,400 కోట్ల నష్టం కలిగిస్తున్న ఈ పైరసీ భూతం పోస్ట్-ప్రొడక్షన్ లీక్‌లు, థియేటర్ క్యామ్‌కార్డింగ్ వంటి కారణాలతో విజృంభిస్తోంది. TGCSB వ్యూహం టాలీవుడ్‌కు రక్షణ కల్పిస్తుందని ఆశించబడుతోంది.

పైరసీ రక్కసిని అంతం చేయడానికి TGCSB పంతం పట్టింది. దీనికోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో… ఓ కొత్త ఫార్ములాతో ముందడుగు వేసింది. దాని ఇంప్లిమెంట్‌తో, టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న పైరసీకి ఇక ఫుల్‌స్టాప్‌ పడనుందా? అంటే అవుననే కామెంట్ వస్తోంది. చెదలు తొలిచేసినట్లు…టాలీవుడ్‌ను లోపలనుంచి తొలిచేస్తోంది పైరసీ భూతం. టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌..ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణచివేసినా, మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు రూ.3,700 కోట్ల నష్టం జరుగుతుండగా, భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి రూ. 22,400 కోట్ల నష్టం చేకూరుతోందని, సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో కంటెంట్ లీక్ అవడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల లోపాలు, థియేటర్లలో క్యామ్‌కార్డింగ్ వంటి అంశాలు పైరసీకి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??

Follow Us