Taapsee Pannu: హీరో భార్యకు నేను నచ్చలేదని.. నన్ను సినిమా నుంచి తీసేశారు…

Updated on: Sep 27, 2026 | 12:49 PM

తనకు ఎదురైన చేదు అనుభవాన్ని హీరోయిన్‌ తాప్సీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ సినిమాలో తనను తీసుకున్న తర్వాత ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా తొలగించారని తెలిపింది. కారణం తెలుసుకోవాలని పట్టుబట్టడంతో, హీరో భార్యకు తాను నచ్చకపోవడంతోనే తీసేశామని యూనిట్‌ చెప్పిందని తాప్సీ పేర్కొంది. హీరో, ఆయన భార్య పేర్లను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇలాంటి కారణంతో హీరోయిన్‌ను తొలగించడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పింది.

హీరోయిన్ తాప్సీ! రీసెంట్‌గా గాంధారీ మూవీతో నేరుగా ఓటీటీ ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ… ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి రివీల్ చేసింది. ఓ సినిమాకు తీసుకున్నాక.. తనను సడన్‌గా వద్దని చెప్పారని తాప్సీ గుర్తు చేసుకుంది. తనకు ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండానే తొలగించారని.. చెప్పింది. అయితే తాను మాత్రం తనను ఎందుకు తీసేశారనేది చెప్పాల్సిందే అని పట్టుబట్టానని చెప్పింది. దీంతో.. హీరో భార్యకు తాను నచ్చలేదని తొలగించారంటూ యూనిట్ చెప్పేసరికి.. షాకయ్యా నంటూ ఎమోషనల్ అయింది తాప్పీ.. ఆ హీరో భార్యకు తనెందుకు నచ్చలేదనేది.. తనకు తెలియదని.. కానీ.. ఇలా హీరోల భార్యకు నచ్చలేదని హీరోయిన్‌ను తీసేయడం .. తనకు అత్యంత దారుణంగా అనిపించిందని తాప్సీ చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు కానీ.. అతని భార్య పేరును కానీ తాప్సీ రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రేజీ కామెంట్స్‌ ను కూడా రాబడుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. తాప్సీ రీసెంట్ మూవీ… గాంధారీ.. కాపీ రైట్ వివాదం మధ్య నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ అయితే తెచ్చుకుంటోంది. సినిమా భారాన్నంతా తాప్సీ తన భుజాలపై వేసుకుని నడిపించింది. కూతురిని పోగొట్టుకున్న తల్లిగా, ప్రతీకారం తీర్చుకునే క్రమంలో తాత్కాలిక అంధురాలిగా ఆమె నటన, భావోద్వేగాలు బాగున్నాయి. చాలా కాలం తర్వాత తాప్సీ పూర్తిస్థాయి యాక్షన్ అవతారంలో కనిపించింది. సినిమాలో ఆమె చేసిన స్టంట్స్, యాక్షన్ డ్రామా అలరిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: ఆ ఒక్క యుద్ధం సీక్వెన్స్‌తో.. ఒక్కొక్కరూ పిచ్చెక్కడం పక్కా.. 30 నిమిషాలు కళ్లప్పగించాల్సిందేనట!

Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్‌ రెడీ.. సాలిడ్ టీజర్ వస్తోంది!

The Paradise Collection: దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ రూ.100CR!

Avengers Endgame Encore: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ దెబ్బకు.. మన బాహుబలి రికార్డ్‌ గల్లంతు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ కోసం ఆగాల్సిన పనే లేదు!

Loading...
Unable to load recommendations.
Follow Us