ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే

Edited By:

Updated on: Feb 26, 2026 | 8:56 PM

ఈ సమ్మర్ టాలీవుడ్ హీరోయిన్లకు అగ్నిపరీక్ష కానుంది. వరస ఫ్లాపులతో ఉన్న శ్రీలీల, మాళవిక నాయర్, నభా నటేష్, మృణాల్ ఠాకూర్ వంటి తారలకు ఈ వేసవి విడుదలలు కెరీర్ మలుపు కానున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, బైకర్, స్వయంభు వంటి చిత్రాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సమ్మర్ హిట్స్ వారి కెరీర్‌కు కీలకం.

ఈ సమ్మర్ హీరోలకే కాదండోయ్.. హీరోయిన్లకు కూడా కీలకమే. మామూలుగా మేజర్ సీజన్స్ అంటే హీరోలే గుర్తుకొస్తుంటారు. కానీ ఈసారి సమ్మర్ అంతా ముద్దుగుమ్మలందరికీ కీలకం కానుంది. ఈ వేసవిలో రాబోయే 90 శాతం సినిమాల్లోని బ్యూటీస్ అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. దాంతో వాళ్ల కెరీర్‌కు ఈ సమ్మర్ పరీక్ష పెట్టబోతుంది. మరి అందులో పాస్ అయ్యేదెవరు..? అసలు పరీక్ష రాస్తున్నది ఎంతమంది..? మామూలుగా సంక్రాంతి, సమ్మర్, దసరా లాంటి సీజన్స్ వస్తే చూపులన్నీ హీరోల వైపే వెళ్తుంటాయి. కానీ ప్రతీసారి హీరోయిన్లకు కూడా ఈ సీజన్స్ కీలకమే. తాజాగా సమ్మర్ సీజన్‌ను స్టార్ట్ చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్న శ్రీలీల, రాశీ ఖన్నా ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. మార్చి 26న రానుంది ఈ చిత్రం. మరీ ముఖ్యంగా శ్రీలీలకు ఉస్తాద్ కీలకంగా మారింది. ఏప్రిల్ 3న శర్వానంద్ బైకర్ విడుదల కానుంది. అందులో నటిస్తున్న మాళవిక నాయర్‌కు హిట్ వచ్చి దశాబ్ధం దాటింది. ఎవడే సుబ్రమణ్యం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మాళవిక హిట్ రుచి చూడలేదు. బైకర్‌తో ఆ లోటు భర్తీ చేసుకోవాలని చూస్తున్నారు ఈ కేరళ కుట్టి. ఇక నిఖిల్ స్వయంభుతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు నభా నటేష్. ఈ సమ్మర్‌లో ఏప్రిల్ 10న స్వయంభు.. మే 1న నాగబంధం సినిమాలతో రానున్నారు నభా నటేష్. ఇదే సమ్మర్‌లో డెకాయిట్‌తో వచ్చేస్తున్నారు మృణాళ్ ఠాకూర్. వరస ఫ్లాపుల్లో ఉన్న భాగ్యశ్రీ బోర్సే.. మే 1న లెనిన్ సినిమాతో రానున్నారు. అలాగే సమంత మే 15న మా ఇంటి బంగారంతో పలకరించబోతున్నారు. మరి వీళ్లలో ఎంతమంది హిట్ కొడతారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుమ్మేస్తున్న కుర్రాళ్లు.. ఒక్కరు కూడా తగ్గట్లేదు

Nani: నాని డబుల్ బ్లాస్ట్.. ఈసారి మామూలుగా ఉండదు

నాలుగేళ్ళ కష్టం వర్సెస్ ఆర్నెళ్ల అదృష్టం.. ఏది గెలుస్తుంది

Vijay-Rashmika Marriage: 100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ??

Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో

Follow Us