Sudigali Sudheer: సొంత సినిమాను గాలికొదిలేశాడు! సుధీర్ తీరుపై తీవ్ర విమర్శలు
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన G.O.A.T సినిమా విడుదల తర్వాత ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఇంటర్వ్యూ మినహా పెద్దగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, సక్సెస్ ఈవెంట్‌కు హాజరుకాకపోవడంపై అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు హీరోయిన్ దివ్య భారతి మాత్రం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఒక సినిమా హిట్ అవ్వాలన్నా.. కనీసం ప్రేక్షకుల్లోకి వెళ్లాలన్నా హీరో ప్రమోషన్స్ చాలా ముఖ్యం. కానీ తన సినిమాను ప్రమోట్ చేయాల్సిన హీరోనే ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటే.. అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఇప్పుడు సుడిగాలి సుధీర్ విషయంలో ఇదే చర్చ జరుగుతోంది. సుడిగాలి సుధీర్ హీరోగా.. దివ్య భారతి హీరోయిన్గా నటించిన సినిమా G.O.A.T. అనౌన్స్మెంట్ టైంలోనే ఈ సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయింది. కానీ ఆ తర్వాత మాత్రం ఎక్కువ వివాదాలతోనే ఈ మూవీ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అప్పట్లో హీరోయిన్ దివ్య భారతి.. సినిమా దర్శకుడి వ్యవహారశైలిపై సంచలన ఆరోపణలు చేయడం.. సుడిగాలి సుధీర్‌పై కూడా విమర్శలు చేయడంతో ఈ మూవీ చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. మరోవైపు బడ్జెట్ సమస్యలు, దర్శకుడితో ఇబ్బందులు, సుధీర్ డేట్స్.. ఇలా రకరకాల కారణాలతో షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు నవంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమా టాక్ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్‌గా మారింది. అదే సుధీర్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం! ఆయనత తీరు!సాధారణంగా హీరోలు తమ సినిమా విడుదల సమయంలో ఎంత బిజీగా ఉన్నా.. ప్రమోషన్స్‌కు కొంత సమయం కేటాయిస్తారు. కానీ G.O.A.T విషయంలో సుధీర్ వ్యవహరించిన తీరు మాత్రం భిన్నంగా కనిపించింది. బిత్తిరి సత్తితో చేసిన ఒక్క ఇంటర్వ్యూ మినహా.. పెద్దగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చినా.. తనకు షూటింగ్ ఉందంటూ ముందుగానే మాట్లాడి వెళ్లిపోయాడు. ఇక సినిమా విడుదల తర్వాత జరిగిన సక్సెస్ ఈవెంట్‌కు కూడా హాజరు కాలేదు. దీంతో అసలు సుధీర్‌కు ఏమైంది? సొంత సినిమాపై ఎందుకింత నిర్లక్ష్యం? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు హీరోయిన్ దివ్య భారతి మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా కనిపించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. సక్సెస్ ఈవెంట్ అయినా.. అన్నీ తానై వ్యవహరించారు. సినిమా విడుదల రోజున థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడారు. తన సినిమాను చూడాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు.!! తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి హీరోయిన్ ఓ పక్క ఇంత కష్టపడుతుంటే.. హీరోగా సుధీర్ మాత్రం ముందుకు రాకుండా సైలెంట్‌గా ఉండడం ఇప్పుడు సుధీర్ ఫ్యాన్స్‌కు కూడా నచ్చలేదని తెలుస్తోంది.ఒక సినిమా విషయంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మేకింగ్ సమయంలో మనస్పర్థలు రావొచ్చు. కానీ ఒక హీరోగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు.. తన వంతు బాధ్యతగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ముఖ్యం.ఎందుకంటే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాతో హీరో కెరీర్ కూడా ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హీరోగా తన మార్కెట్‌ను పెంచుకోవాలనుకునే సుధీర్.. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇదేమీ పట్టించుకోకుండా సుధీర్ ఇలా పక్కకు తప్పుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త ట్రాన్స్పోర్ట్.. మరి ప్రయాణికుల కష్టాలు తీరుతాయా?
Vijay Antony: విజయ్ ఆంటోని చెప్పులు ఎందుకు ధరించడో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు
డాలర్ కు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. అసలు విషయం ఇదేనా?
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ.. ఏకంగా 91 లక్షల గోల్డ్ కొట్టేసిన ఉద్యోగి
కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్ సంచలన కామెంట్స్
