Ranveer Singh: వామ్మో.. పురుగును కరకరా నమిలి మింగేసిన స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌ షాక్‌..

|

Jul 11, 2022 | 9:01 PM

మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ (Bear Grylls).


మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ (Bear Grylls). ఆయన చేసే అడ్వెంచర్‌ సాహసాల్లో పలువురు సెలబ్రిటీలు కూడా భాగస్వాములవుతుంటారు. గతంలో ప్రధాని నరేంద్రమోడీ , స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌ తదితరులు గ్రిల్స్‌తో కలిసి అడవుల్లో సాహస యాత్రలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్‌ హీరో చేరాడు. అతనే రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh). బేర్‌గ్రిల్స్‌తో కలిసి అతను చేసిన అడ్వెంచరస్‌ జర్నీకి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ‘జై భజరంగ్‌ భళి అంటూ ఎత్తైన కొండలను ఎక్కుతూ, క్రూర మృగాల నుంచి తప్పించుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు రణ్‌వీర్‌. అడవిలో అడుగుపెట్టడానికి ముందు రణ్‌వీర్‌ శారీరకంగా, మానసికంగాఎలా సిద్ధమయ్యాడనేది తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో సూటుబూటేసుకున్న స్టార్‌ హీరో తినడానికి రెడీ అయ్యాడు. అయితే అతడికోసం ఓ పురుగును ప్లేటులో పెట్టి తీసుకొచ్చారు. దానిని చూడగానే మొదట ఆశ్చర్యపోయాడు రణ్‌వీర్‌. అయితే చేసేదేం లేక అయిష్టంగానే దాన్నో పట్టు పట్టాడు. ఆ పురుగును కరకరా నమిలి మింగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అసలు షోలో ఇంకే రేంజ్‌లో రచ్చ చేస్తాడో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?