Jawan 2: జవాన్ సీక్వెల్.. బాద్షా బద్ధలు కొడతారా ??
షారుఖ్ ఖాన్ 'జవాన్' సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. అట్లీతో కలిసి బాద్‌షా రెండో భాగంపై ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. SRK తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకే ఈ నిర్ణయం. జవాన్ 2 కోసం ఓ సౌత్ స్టార్ విలన్‌గా ఖరారయ్యే అవకాశం ఉంది. అట్లీ తన ప్రస్తుత బన్నీ ప్రాజెక్ట్ పూర్తవగానే జవాన్ 2 సెట్స్‌పైకి వెళ్లనుంది.
సీక్వెల్స్ హవా నడుస్తోందిగానీ, షారుఖ్ మనసులో అలాంటి ఓ థాట్ ఉంటుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో నెక్స్ట్ షారుఖ్ ఎవరు? అనే టాపిక్ నడుస్తుంటే, నేనుండగా ఇంకొకరు ఎందుకన్న యాటిట్యూడ్ కనిపిస్తోంది బాద్షాలో. ఇంతకీ ఆయన సీక్వెల్ కథేంటి? తన ప్లేస్‌ని హోల్డ్ చేయడానికి కింగ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి? చూసేద్దాం వచ్చేయండి. షారుఖ్ హీరోగా నటించిన జవాన్‌కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ సౌత్ కెప్టెన్‌ని నమ్మి షారుఖ్ చేసిన జవాన్ ఎంత పెద్ద హిట్ అయిందో నార్త్ జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ఉందనే టాక్ ముంబైలో నడుస్తోంది. జవాన్‌కి సీక్వెల్ చేయాలని షారుఖ్ – అట్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. అందులో భాగంగా రకరకాల వెర్షన్లు సిద్ధం చేశారట. లేటెస్ట్ గా ఓ వెర్షన్‌కి బాద్షా టిక్ మార్క్ పెట్టేశారన్నది న్యూస్. ఈ ఏడాదే సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కింగ్ పనుల్లో బిజీగా ఉన్న షారుఖ్ , ఈ మూవీ తర్వాత జవాన్ కోసమే ప్రిపేర్ అవుతారట. ఫస్ట్ పార్టులో కనిపించిన వారందరూ సెకండ్ పార్టులోనూ ఉంటారట. అయితే విలన్‌గా మరో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ కోసం అట్లీ ట్రై చేస్తున్నట్టు టాక్. నేనంటూ ముంబైలో అడుగుపెట్టి సినిమా చేస్తే, నాతో పాటు దక్షిణాది టెక్నీషియన్లు ఇంకో 50 మందిని అయినా తీసుకెళ్తానని జవాన్ ప్రమోషన్ల టైమ్‌లోనే చెప్పారు అట్లీ. ఇప్పుడు అందులో భాగంగానే సౌత్ ఆర్టిస్టునే విలన్‌గా సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నట్టు టాక్. ఇప్పుడు చేస్తున్న బన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే జవాన్ సీక్వెల్‌కి అట్లీ షిఫ్ట్ అవుతారనే టాక్ స్ప్రెడ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తెలంగాణ లో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్
Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు
రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??
Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్
పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు