Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?
శ్రీ విష్ణుకు అరుదైన సమస్య ఎదురైంది. ఆయన రెండు చిత్రాలు, మృత్యుంజయ్ మరియు విష్ణు విన్యాసం, ఫిబ్రవరిలో ఒకేరోజు విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బాలయ్య, నానిలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 'కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్'గా మారిన శ్రీ విష్ణు ఈ క్లాష్‌ను ఎలా డీల్ చేస్తారో ఆసక్తిగా మారింది. ఈ అరుదైన రిలీజ్ సమస్య సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శ్రీ విష్ణుకు విచిత్రమైన సమస్య వచ్చింది.. ఎప్పుడో గానీ అలాంటి సమస్యలు మన హీరోలకు రావు. 30 ఏళ్ళ కింద బాలయ్యకు.. పదేళ్ళ కింద నానికి సేమ్ ఇష్యూ వచ్చింది. ఇన్నాళ్లకు మళ్ళీ శ్రీ విష్ణు కళ్ళ ముందు అదే సమస్య కనిపిస్తుంది. మరి దాన్ని కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ ఎలా డీల్ చేయబోతున్నారు..? అసలు శ్రీ విష్ణకు వచ్చిన ఆ సమస్యేంటి..? రెండేళ్ళ కింద వచ్చిన సామజవరగమన నుంచి శ్రీ విష్ణు మార్కెట్ పెరిగిపోయింది.. ఇమేజ్ మారిపోయింది. అప్పట్నుంచే కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ అయిపోయారీయన. ఆ తర్వాత ఓం భీమ్ బుష్, సింగిల్ లాంటి మూవీస్ మంచి హిట్టయ్యాయి. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విన్యాసం, కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీవిష్ణు. కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది కానీ.. మిగిలిన రెండు సినిమాలతోనే శ్రీ విష్ణుకు అనుకోని సమస్య వచ్చి పడిందిప్పుడు. యధునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తున్న విష్ణు విన్యాసం ఫిబ్రవరిలో విడుదల కానుందని అనౌన్స్ చేసారు మేకర్స్. మరోవైపు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ సైతం ఫిబ్రవరిలోనే రానుంది. మృత్యుంజయ్ ప్రమోషన్స్ మొదలవ్వడమే కాదు.. ఫిబ్రవరి 27 అంటూ డేట్ ఇచ్చారు మేకర్స్. మరోవైపు విష్ణు విన్యాసం అదేరోజు రానుందనే ప్రచారం మొదలైంది. గతంలో నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం, జెండా పై కపిరాజు.. బాలయ్య బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ ఒకేరోజు విడుదలయ్యాయి. ఇప్పుడు శ్రీ విష్ణుకు ఇదే జరుగుతుందా లేదంటే రెండూ గ్యాప్‌లో విడుదలవుతాయా చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..
Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్
ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్ రూల్స్‌లో మార్పు