సంక్రాంతి రేసులో శ్రీవిష్ణు.. స్టార్ హీరోలకు పోటీగా ‘ఫ్యామిలీ ప్యాక్’!
2027 సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ఇప్పటి నుంచే వేడెక్కుతోంది. చిరంజీవి ‘కాకా’, వెంకటేష్ సినిమా సహా పలు క్రేజీ ప్రాజెక్టులు పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ పోటీలోకి యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజా చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’ సంక్రాంతి సీజన్‌లోనే విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టాప్ స్టార్స్‌తో పాటు యంగ్ హీరోలు కూడా బరిలో దిగడంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రష్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. టాప్ స్టార్స్ ఈ సీజన్‌లో బరిలో దిగేందుకు డేట్ లాక్ చేశారు. అయినా డోంట్ కేర్ అంటు యంగ్ హీరోల కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఇంత రష్‌లో ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా సంక్రాంతి సీజన్‌లో డేట్ లాక్ చేసిన ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమాల పండుగ. 2027 సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ అప్పుడే బడా మేకర్స్ కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’, విక్టరీ వెంకటేష్ జనవరి 12 విడుదల సినిమాలతో పాటు.. ‘సంబరాల ఏటిగట్టు’, ‘జార్జ్ క్రిష్’ లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి బాక్సాఫీస్ ఫైట్‌ను హీటెక్కించాయి. ఇప్పుడు ఈ పండుగ బరిలోకి మరో సినిమా కూడా ఎంట్రీ ఇచ్చింది. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు.. ఈసారి ఏకంగా పెద్ద సినిమాలతోనే పోటీకి సై అంటున్నారు. లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా ఇదే సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు. ఓ వైపు టాప్ స్టార్స్, మరో వైపు యంగ్ హీరోలు ఒకేసారి బరిలో దిగుతుండటంతో సంక్రాంతి వార్ మరింత ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను క్యాష్ చేసుకోవడానికే చిన్న సినిమాలు కూడా ధైర్యంగా బరిలోకి దిగుతున్నాయి. మరి ఈ రేసు నుంచి ఎవరైనా వెనక్కి తగ్గుతారా.. లేక అందరూ కలిసొస్తారా అన్నది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో మైథలాజికల్ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్ హీరోలు!
గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్!
Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్