Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..
ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్ డేట్స్ విషయంలో సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వంగా సినిమాకు బల్క్ డేట్స్ కోరగా, ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలు చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. నిరంతరాయంగా షూటింగ్ చేస్తేనే లుక్, కంటిన్యూటీ సమస్యలు ఉండవని వంగా వాదిస్తున్నారు. మరి ప్రభాస్ తన స్టైల్ మార్చుకుంటారా లేక వంగానే రాజీ పడతారా అనేది తేలాల్సి ఉంది.
స్పిరిట్ విషయంలో అసలేం జరుగుతుంది..? ఇంతకీ ఈ సినిమా షూటింగ్ మొదలైందా..? మొదలైతే సందీప్ రెడ్డి వంగా స్కూల్‌కు ప్రభాస్ వస్తున్నారా లేదంటే ప్రభాస్ స్కూల్‌కే సందీప్ వంగా మారిపోతున్నారా..? తెరవెనక ఏం జరుగుతుంది..? మిగిలిన సినిమాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రభాస్ ఏం చేస్తున్నారు..? దానికి సందీప్ రియాక్షన్ ఏంటి..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం రాజా సాబ్ సినిమాను ఓటిటిలో ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో నిరాశ పరిచినా.. డిజిటల్ కోసం కొత్త సీన్లతో సినిమాని ముస్తాబు చేసారు మేకర్స్. ఇక ఫుల్ బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కుదిర్తే ఏడాదికి రెండు సినిమాలు కూడా విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ ఫౌజీ, కల్కి 2 లైన్‌లో ఉన్నాయి కూడా. ప్రభాస్ ప్లానింగ్‌తో సందీప్ రెడ్డి వంగాకు చిన్న మిస్ కమ్యూనికేషన్ ఇక్కడే వస్తుందని తెలుస్తుంది. స్పిరిట్‌కు బల్క్ డేట్స్ కావాలంటున్నారు సందీప్. కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తాను కానీ.. తన సినిమా చేస్తున్న సమయంలో మిగిలిన ప్రాజెక్ట్స్ చేయొద్దు.. అలా చేస్తే కంటిన్యూటి ఇష్యూస్‌తో పాటు, లుక్‌లో తేడాలు వస్తాయనేది సందీప్ కంప్లైంట్. ప్రభాస్ ప్లాన్ మరోలా ఉంది.. ఒకేసారి రెండు మూడు సినిమాలు సైమంటేనియస్‌గా చేయాలనేది ఈయన ఆలోచన. నెలలో ఒక్కో సినిమాకు 10 రోజుల చొప్పున.. మూడు సినిమాలు చేయాలని చూస్తున్నారు ఈ హీరో. గతంలో ఆదిపురుష్, సలార్, రాజా సాబ్, కల్కి సమయంలో ఇదే ఫార్ములా అప్లై చేసారు రెబల్ స్టార్. కానీ అప్పుడు గందరగోళం కూడా అంతే ఉంది. స్పిరిట్‌కు వారానికి 10 రోజుల కాన్సెప్ట్ కాకుండా.. బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. మరిప్పుడు సందీప్ దారిలోకి ప్రభాస్ వస్తారా లేదంటే ప్రభాస్ కోసం సందీపే తన వర్కింగ్ స్టైల్ మార్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్‌లో విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండవు కాబట్టి షూట్ త్వరగా పూర్తి చేసి.. మార్చి 5, 2027న విడుదల చేయాలని చూస్తున్నారు వంగా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్
ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్ రూల్స్‌లో మార్పు
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి