పవన్‌తో సింగీతం ‘జీసెస్’ సినిమా చేద్దామనుకున్నారట.. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిదంటే

Updated on: Oct 07, 2026 | 10:29 PM

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, పవన్‌ కల్యాణ్‌తో ‘ప్రిన్స్‌ ఆఫ్‌ పీస్‌’ అనే అంతర్జాతీయ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఏసుక్రీస్తు జీవిత నేపథ్యంతో రూపొందించాలనుకున్న ఈ చిత్రంలో పవన్‌ జీసస్‌ పాత్రలో కాకుండా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించాల్సి ఉంది. అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 2010లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ భారీ బడ్జెట్‌, ఇతర కారణాలతో సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

కమర్షియల్ కథలు, హంగులకు దూరంగా ప్రేక్షకుల ఊహలకు అందని కాన్సెప్టులతో సినిమాలు తీశారు సింగీతం శ్రీనివాసరావు. తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు సింగీతం. సినిమా దర్శకత్వంతోపాటు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన.. తదితర రంగాల్లోనూ సింగీతం తన ట్యాలెంట్ చూపించారు. చివరకు 95ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ అనే మ్యూజిక్ ఫాంటసీ సినిమాను ఆడియెన్స్ కు అందించిన సింగీతం అక్టోబర్ 04న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఈ లెజెండరీ డైరెక్టర్ కు అశ్రు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా స్థాయిని పెంచిన సింగీతం శ్రీనివాసరావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. గ్రాండ్ గా ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్టు వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. జీసస్ క్రైస్ట్ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటర్నేషనల్ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు సింగీతం. ఏసుక్రీస్తు జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి అందించిన సందేశాలను నేటి తరానికి చెప్పాలని ఒక మంచి కథను రెడీ చేసుకున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కథానాయకుడిగా తీసుకున్నారు. పవన్ ది జీసస్ పాత్ర కాదని, కానీ కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ రోల్ అని అని సింగీతం చెప్పుకొచ్చారు. అలాగే అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2010 లో ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ పేరుతో ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. విజయేంద్ర వర్మ, శ్రీ రామదాసు వంటి సినిమాలు నిర్మించిన కొండా కృష్ణంరాజు ఈ సినిమాకు నిర్మించేందుకు ముందుకొచ్చారు. ప్రిన్స్ ఆఫ్ పీస్ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం వంటి భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించాలని సింగీతం ప్లాన్ చేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్, సింగీతం, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. యేసు క్రీస్తు నడయాడిన ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి, సినిమాను అత్యంత సహజంగా ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కించాలనుకున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి పోయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనున్న తరుణంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. సెట్స్ పైకి వెళ్లకుండానే అర్ధాంతంగా ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఆగిపోయింది. దీనికి కారణం బడ్జెట్ అనే టాక్ ఉంది. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఇంటర్నేషనల్ లొకేషన్లు, విజువల్స్, రెమ్యునరేషన్ల కోసం అంచనా వేసిన దానిక కంటే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు. మరోవైపు కథ, స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కూడా రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈలోగా పవన్ కల్యాణ్ ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో జీసస్ క్రైస్ట్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఒక వేళ పవన్ కల్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చివుంటే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచేదన్న అభిప్రాయం ఇప్పటికీ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Venu Swamy: నేను సన్నీ లియోన్ లాంటోడిని..

లైన్ క్రాస్ చేసిన కార్తీ…తమిళ థియేటర్‌ ఓనర్లు సీరియస్

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

బట్టలు తీసుకుందామని కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు

Published on: Oct 07, 2026 09:57 PM
Loading...
Unable to load recommendations.
Follow Us