Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!

Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!

Updated on: Nov 28, 2026 | 5:48 PM

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రసవంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రాజ్ నిడిమోరు పిన్ని, ప్రముఖ సింగర్ శోభారాజు స్పష్టత ఇచ్చారు. డెలివరీ సమయంలో ఎదురైన సవాళ్లు, ఆ తర్వాత నార్మల్ డెలివరీ ఎలా సాధ్యమైంది అనే ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. శోభారాజు మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహమాడిన సంగతి తెలిసిందే. నవంబర్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, తన కుమారుడికి దేవ్ నిడిమోర్ అని నామకరణం చేశారు. ఈ శుభవార్తతో సమంత, రాజ్ కుటుంబాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. అయితే, సమంతకు నార్మల్ డెలివరీ జరిగిందా లేక సిజేరియన్ చేశారా అనే విషయంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయమై ప్రముఖ సింగర్, రాజ్ నిడిమోరు పిన్ని శోభారాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 19న డెలివరీ సమయంలో బేబీ మెడ చుట్టూ పేగు వేసుకుని ఉండటం వల్ల కదలికలకు ఇబ్బంది అవుతుందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని ఆమె తెలిపారు. ఆ తర్వాత డాక్టర్లు సిజేరియన్ చేయాలని సూచించడంతో కుటుంబం మొత్తం టెన్షన్ పడి, దేవుడిపై భారం వేసి హనుమాన్ చాలీసా చదవడం ప్రారంభించిందని శోభారాజు వివరించారు. కొన్ని క్షణాల తర్వాత సమంతకు నార్మల్ డెలివరీ జరిగిందని, బిడ్డ క్షేమంగా పుట్టాడని రాజ్ నుంచి శుభవార్త అందిందని ఆమె తెలిపారు. ఇది నిజంగా దైవ మహిమే అని శోభారాజు పేర్కొన్నారు. ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్

Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి

పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక

అలియాస్ రుక్మిణీ ట్రైలర్.. నితిన్‌ను గట్టెక్కిస్తుందా..?

బంగారం కొంటున్నారా.. కక్కుర్తితో అలా చేస్తే మీ కొంప కొల్లేరే..!

Loading...
Unable to load recommendations.
Follow Us