Samantha: గాయత్రీ హోమ ఫలితం.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నవంబర్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ కుమారుడి పేరు దేవ్ నిడిమోరు అని ప్రకటించారు. డెలివరీకి రెండు రోజుల ముందు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అభిమానులు ఈ వార్తపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్టర్ మయోసైటిస్.. ఎక్కువగా ఆధ్యాత్మిక బాటలోనే ప్రయాణిస్తున్న సమంత.. ప్రత్యేక పూజల ఫలితమా అని.. ఇప్పుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్‌ను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుని.. ఎమోషనల్ అయ్యారు. తమ చిన్నారి చేతిని పట్టుకున్న ఒక అందమైన ఫోటోను అభిమానులతో పంచుకున్న సమంత, రాజ్.. తమ కొడుకుకు “దేవ్ నిడిమోరు” అని నామకరణం చేసినట్లు తమ పోస్టులో రాసుకొచ్చారు. “మా అందమైన మగబిడ్డ.. దేవ్ నిడిమోరు. నవంబర్ 19న మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంతో నిండిపోయాయి” అంటూ ఈ దంపతులిద్దరూ తమ పోస్ట్‌కు భావోద్వేగపూరితమైన క్యాప్షన్‌ను జోడించారు. అయితే డెలివరీకి సరిగ్గా రెండు రోజుల మందే.. సమంత – నిడమోరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లీ బిడ్డల క్షేమం కోసం సమంత అత్త గారింట్లో మాతృ శిశు మంగళ ఆశీర్వాదం పేరిట జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గాయత్రీ హోమం కూడా నిర్వహించారు. ఈ పూజల ఫలితమే.. సమంతకు పండండి మగ బిడ్డ జన్మించిందంటూ ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దేవ్ నిడమోర్‌ను చూపించండి అంటూ.. ఇప్పటి నుంచి సామ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోయి లేకుంటే ఎలా.. అడ్డంగా మోసపోయింది..!
Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!
Ramya Krishnan: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ – విలన్ మధ్య కొట్లాట.. ఎవ్వరూ తగ్గట్లేగా..
రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. బాలీవుడ్ నటుడి దయనీయ స్థితి
