Samantha Expensive things: సమంత దగ్గరున్న 5 ఖరీదైన వస్తువులేంటో తెలుసా..? తాజాగా మరొకటి..
హీరోయిన్ సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే ప్రతీది ఎంతో స్పెషల్ అట్రాక్షన్‌గా, కాస్ట్లీగా ఉంటాయి. సెలబ్రిటీ అంటేనే లగ్జరీ లైఫ్. ఖరీదైన ఇల్లు, కార్లు, స్టైలిష్ డ్రెస్.. ఇలా అన్ని ప్రతీది రిచ్‌గానే ఉంటుంది.
హీరోయిన్ సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే ప్రతీది ఎంతో స్పెషల్ అట్రాక్షన్‌గా, కాస్ట్లీగా ఉంటాయి. సెలబ్రిటీ అంటేనే లగ్జరీ లైఫ్. ఖరీదైన ఇల్లు, కార్లు, స్టైలిష్ డ్రెస్.. ఇలా అన్ని ప్రతీది రిచ్‌గానే ఉంటుంది. అయితే అందరు సెలబ్రిటీల అభిరుచులు ఒకేలా ఉండవు. ఒక్కోకరిది ఒక్కోలా ఉంటుంది. సమంత విషయానికొస్తే.. ఈమెకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. డిఫరెంట్ ఔట్ఫిట్లతో కనువిందు చేస్తూ ఫ్యాషన్ లేడీగా పేరు కూడా తెచ్చుకుంది. వేసుకునే చెప్పుల నుంచి చేతికి బ్రాస్లెట్, హ్యాండ్ బ్యాగ్, మెడలో వేసుకునే నెక్లెస్, డ్రెస్ ఇలా ప్రతీది డిఫరెంట్‌గా ధరిస్తూ ఆకట్టుకుంటుంది. అవి కూడా ఎంతో రిచ్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాయి. రీసెంట్గా కూడా సిటాడెల్ ప్రమోషన్స్‌లోనూ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ నేఫథ్యంలో ఫ్యాషన్‌కు సంబంధించిన సమంత దగ్గరున్న ఐదు ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం.. మలానో బ్లహనిక్స్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ చెప్పుల ఖరీదు 90 వేల నుంచి లక్ష రూపాయాల వరకు ఉంటుంది. ఆమె దగ్గరున్న మరో విలువైన వస్తువు ఈ హ్యాండ్ బ్యాగ్. ప్రస్తుతం సమంత వాడే హ్యాండ్ బ్యాగ్ గుచ్చి కంపెనీకి చెందిన ప్రొడక్ట్. దీని ధర రూ 1.40 లక్షలు ఉంటుందని తెలిసింది. మరో విలువైన హ్యాండ్ బ్యాగ్ కూడా సమంత దగ్గర ఉంది. దీని ధర రూ. 2.5 లక్షలు. ఇక సమంత డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సొంత కంపెనీ సాకీ వరల్డ్ బ్రాండ్‌ను సామ్ ఎక్కువగా ధరిస్తుంటుంది. ఇవి కూడా చాలా ఖరీదైనవి. ఫైనల్‌గా సమంత నివాసముందుటున్న ఇల్లు చాలా ఖరీదైనది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆమె ఇల్లు.. ఎంతో విలాసవంతంగా ఉంటుంది. కొద్ది నెలల క్రితమే ముంబయిలో కూడా ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!