ఏడాదికి రూ.2 కోట్ల జీతం.. సల్మాన్​ బాడీగార్డ్​ అంటే మామూలుగా ఉండదు చిన్నా

|

Jul 26, 2024 | 12:54 PM

సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండటం కామనే. కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? ఆ బాడీగార్డు సంపాదన కోట్లలో ఉందంటే మీరు నమ్ముతారా? అవును బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో బాడీగార్డు గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తుండడం.. ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది! ఎస్ ! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్​ గుర్మీత్ సింగ్ జాలీ జీతం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండటం కామనే. కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? ఆ బాడీగార్డు సంపాదన కోట్లలో ఉందంటే మీరు నమ్ముతారా? అవును బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో బాడీగార్డు గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తుండడం.. ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది! ఎస్ ! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్​ గుర్మీత్ సింగ్ జాలీ జీతం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. గత మూడు దశాబ్దాలుగా సల్లూ భాయ్‌కు బాడీగార్డ్​గా వ్యవహరిస్తున్న ఇతన్ని షేరా అని ముద్దుగా పిలుచుకుంటారు ఇండస్ట్రీ ప్రజలు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా.. ముంబయి నగరంలో 1969లో పుట్టాడు. షేరా జూనియర్ బాడీ బిల్డింగ్​లో ఛాంపియన్‌ టైటిల్ గెలిచారు. 1987లో మిస్టర్ ముంబయి టైటిల్ కూడా సాధించారు. ఆ తర్వాత 90లలో బాడీ గార్డుగా పని చేయడం మొదలుపెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేశారు. అలా పనిచేస్తున్న సమయంలో 1995లో సల్మాన్ ఖాన్‌కు పరిచయమయ్యారు. అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్​ను పర్సనల్ బాడీగార్డుగా నియమించుకున్న సల్మాన్ అప్పటి నుంచి అతడిని వెంటేసుకునే తిరుగుతున్నారు. అలా 30 ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉంటున్న షేరాపై సల్మాన్​కు నమ్మకం, చనువు రెండూ ఎక్కువే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం

Follow us on