Toxic Pre Release Event: టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో యశ్..
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ (KGF) సిరీస్ సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic). ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం తెలుగు ప్రేక్షకుల కోసం హైదరాబాద్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేజీఎఫ్ సినిమాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 1980ల నాటి పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఆగస్ట్ 26న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రచారాల్లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు (ఆగస్ట్ 22న) సాయంత్రం 6 గంటల నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహిస్తుంది చిత్రయూనిట్. దీంతో ఈ కార్యక్రమానికి యశ్‌తో పాటు చిత్రంలో నటించిన నటీనటులు , సాంకేతిక నిపుణులు కాగా.. రాకింగ్ స్టార్‌ను ప్రత్యక్షంగా చూడటానికి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకను మీరు టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..
