సెల్ఫీ దిగాలంటేనే భయపడుతున్న రవీనా టండన్‌

Updated on: Sep 16, 2024 | 8:43 PM

తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చినవారికి ఫొటో ఇవ్వకుండా వేగంగా వెళ్లిపోయిన రవీనా.. తాజాగా వారికి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు వెళ్లారో చెబుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రవీనాటాండన్‌ లండన్‌ వెళ్లారు. అక్కడ రోడ్‌పై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఫొటో అడిగారు.

తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చినవారికి ఫొటో ఇవ్వకుండా వేగంగా వెళ్లిపోయిన రవీనా.. తాజాగా వారికి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు వెళ్లారో చెబుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రవీనాటాండన్‌ లండన్‌ వెళ్లారు. అక్కడ రోడ్‌పై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఫొటో అడిగారు. అయితే ఆమె వారికి ఫొటో ఇవ్వకుండా సెక్యూరిటీని పిలిచి అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. తాజాగా ఈ ఘటనపై రవీనా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇటీవల జరుగుతున్న నేరాలు చూసి భయపడుతున్నా అని పోస్ట్‌లో రాసుకొచ్చారు రవీనా. వారందరూ తన దగ్గరకు ఫొటో కోసం వచ్చినప్పుడు ఎందుకొచ్చారో కూడా తెలుసుకోవాలంటే భయమేసిందనీ తాను ఆ సమయంలో ఒంటరిగా ఉన్నట్లు చెప్పారు. అందుకే అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయాననీ జూన్‌లో బాంద్రాలో తనకు ఎదురైన ఘటన నుంచి తానింకా కోలుకోలేదనీ అందుకే ఒంటరిగా వెళ్తున్నప్పుడు మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. వారికి ఫొటో ఇవ్వాలని తన మనసుకు అనిపించిందనీ కానీ ధైర్యం చేయలేకపోయినట్లు చెప్పారు. వారితో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నాననీ అందుకే వివరణ ఇవ్వాలని ఈ పోస్ట్‌ పెడుతున్నాననీ అన్నారు. ఫొటో నిరాకరించినందుకు తనను క్షమించాలనీ రాసుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kaun Banega Crorepati: పవన్‌ కల్యాణ్‌పై ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న

Loading...
Unable to load recommendations.
Follow Us