Rashmika Mandanna: హర్ట్ అయిన రష్మిక మందన్న.. ఓపిక నశించింది.! హద్దుల్లో ఉండండి అంటూ..వీడియో.

|

Nov 10, 2022 | 6:40 PM

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది.


పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్.. రూమర్స్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది.”గత కొన్ని రోజులుగా.. లేదా నెలలుగా వస్తున్న కొన్ని విషయాలు నన్ను ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించే సమయం వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ పని చాలా సంవత్సరాల కిందే చేయాల్సి ఉంది. నేను నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అనేకసార్లు ద్వేషానికి గురవుతున్నాను. చాలా ట్రోల్స్.. నెగిటివిటి.. నా గురించి మాట్లాడటం.. చాలా బాధిస్తుంది. నాకు తెలుసు నేను ఎంచుకున్న జీవితం చాలా కష్టతరమైనదని. ప్రతి ఒక్కరు నన్ను ప్రేమిస్తారు అని అనుకోను. మీకు నేను నచ్చకపోతే.. నా మీద నెగిటివిటి చేయాలని లేదు. రోజుకు రోజుకు నేను చేసే పని ప్రాముఖ్యత నాకు తెలుసు. నా పని చూసి మీరు ఆనందించడమే నేను ఎక్కువగా పట్టించుకుంటాను… మీరు.. నేను గర్వించదగిన విషయాలను బయటపెట్టడానికి నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను.”

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..