Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న

Edited By:

Updated on: Mar 23, 2026 | 8:18 PM

విరోష్ జంట (రష్మిక, విజయ్ దేవరకొండ) వార్తల్లో నిత్యం వైరల్ అవుతూనే ఉంది. అవార్డుల వేడుకల్లో రష్మిక చలాకీతనం, సంప్రదాయాలను పాటిస్తూనే షూటింగ్స్‌లో పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అత్తగారితో కలిసి వేడుకలకు రావడం, చిన్నారులతో మురిసిపోవడం వారి అభిమాన గణాన్ని పెంచింది. రాబోయే 'రణబాలి' సినిమా గురించి కూడా ఉత్సాహం నెలకొంది.

విరోష్‌ జంట నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. ఈ ఏడాదిని ఇంత పాజిటివ్‌గా ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ రష్మిక ఆనందంగా కనిపించారు. ఈ విషయాన్ని జనాలు మర్చిపోయేలోపు మరో వీడియోతో వైరల్‌ అవుతోందీ జంట. అయినా గద్దర్‌ అవార్డుల వేడుకలో రష్మిక చూపించిన చలాకీ తనం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు ఆమె అభిమానులు. చిన్నారి కోరిందని పిలిచి కూర్చోబెట్టి స్వీట్లు తినిపించి సందడి చేశారు విరోష్‌. పెద్దా, చిన్నా తేడా లేకుండా, తమ పెళ్లిని అందరితోనూ ఈ జోడీ సెలబ్రేట్‌ చేసుకుంటున్న తీరుకు ఫిదా అవుతోంది విరోష్‌ ఫ్యాన్స్ క్లబ్‌. అంతే కాదు, రష్మిక స్టేట్‌ అవార్డు అందుకున్న వేడుకకు అత్తగారితో కలిసి రావడాన్ని గురించి కూడా ఇష్టంగా చెప్పుకుంటున్నారు జనాలు. దేవిశ్రీ ప్రసాద్‌.. సారీ దేవరకొండ అంటూనే రష్మికతో స్టెప్పులు వేయించడం, చిరంజీవి, నాగార్జున అండ్‌ అదర్స్ ని చలాకీగా వెళ్లి రష్మిక కలవడం, ఇలా ప్రతి విషయాన్ని ఇష్టంగా వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. పొద్దున్నే పూజ చేసుకున్నా అంటూ ఉగాది గురించి రష్మిక చెప్పిన తీరు కూడా వైరల్‌ అవుతోంది. ఓ వైపు సంప్రదాయాలు, పూజలను పద్ధతిగా పాటిస్తూనే, ఇంకోవైపు సినిమా షూటింగులకూ హాజరవుతున్నారు రష్మిక మందన్న. మైసా షూటింగ్‌ ఆల్రెడీ స్టార్ట్ చేశారీ బ్యూటీ. ఆమె నటించిన కాక్‌టైల్‌2 త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. విజయ్‌ దేవరకొండ అండ్‌ రష్మిక జంటగా నటిస్తున్న రణబాలి ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2

పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్

2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??

ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్

హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం

Follow Us