వారణాసికి లైన్ క్లియర్.. ఆ మాటలేంటి రణ్‌బీర్..?

Edited By:

Updated on: Nov 10, 2026 | 4:56 PM

‘రామాయణం పార్ట్‌ 1’ ప్రమోషన్స్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. RRR ఇండియన్‌ సినిమాకు అంతర్జాతీయ మార్కెట్‌ తలుపులు తెరిస్తే, ‘వారణాసి’కి ఆ అవకాశాన్ని తమ సినిమా కల్పించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పోలిక తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ట్రోలింగ్‌ మొదలైంది. రాజమౌళి RRRతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.

రామాయణ పార్ట్ 1 సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రణ్‌బీర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎందుకంత పెద్ద పెద్ద కాంట్రవర్సీగా మారుతుంది..? వారణాసి సినిమాకు రామాయణ మూవీ ఇంటర్నేషనల్ డోర్స్ ఓపెన్ చేసిందని రణ్‌బీర్ అనడంలో నిజమెంత..? అసలు గ్లోబల్ మార్కెట్ క్రియేట్ చేసిన రాజమౌళికి వేరే వాళ్ళ సపోర్ట్ అవసరమా..? ఆయనేంటో తెలిసాక ఇలాంటి కామెంట్స్ ఎందుకు..? రామాయణ పార్ట్ 1 ప్రమోషన్స్‌లో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాకు RRR ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ చేస్తే.. తమ సినిమా వారణాసికి ఆ డోర్స్ ఓపెన్ చేసిందని కామెంట్ చేశారు. పాజిటివ్ ఉద్దేశ్యంతోనే రణ్బీర్ ఈ మాటలు అన్నా కూడా.. ఆ కంపారిజన్ తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ మొదలైంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేసిన రాజమౌళి రేంజ్ గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ ఆర్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను తెచ్చి హాలీవుడ్ లెజెండ్స్‌తోనే ఆయన ప్రశంసలు అందుకున్నారు. అలాంటి రాజమౌళి సినిమాకు ఇంకొకరు వచ్చి డోర్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదని తెలుగు ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు. బహుశా ఇండియన్ సినిమా రీచ్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే రణ్‌బీర్ ఆ కామెంట్స్ చేసుండొచ్చు కానీ.. రాజమౌళి సినిమా ముందు ఇలాంటి కంపారిజన్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు. రామాయణ సినిమా ఉన్నా లేకపోయినా కేవలం రాజమౌళి అనే బ్రాండ్‌తోనే వారణాసికి గ్లోబల్ లెవెల్‌లో సాలిడ్ మార్కెట్ ఎప్పుడో క్రియేట్ అయిపోయిందని అందరికీ తెలిసిన విషయమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్

కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు

హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి

ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్‌

Loading...
Unable to load recommendations.
Follow Us