రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

Updated on: Apr 05, 2026 | 9:55 AM

అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణం సినిమా నుంచి తొలి గ్లింప్స్ విడుదలైంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించిన ఈ టీజర్ హాలీవుడ్ నాణ్యతతో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందింది. నితీష్ తివారీ దర్శకత్వంలో, DNEG గ్రాఫిక్స్‌తో, దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం దీపావళికి తొలి భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఇండియన్ సినిమా రామాయణం నుంచి మొదటి గ్లింప్స్ విడుదలైంది. రణబీర్ కపూర్ రాముడిగా పరిచయం చేస్తూ ఈ టీజర్‌ను విడుదల చేశారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది, తొలి భాగం దీపావళికి విడుదల కానుంది.తాజాగా విడుదలైన టీజర్ కేవలం రాముడి పాత్రను పరిచయం చేసింది. రణబీర్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రణబీర్ లుక్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. గత రామాయణాల్లో రాముడు ఎలా కనిపించాడో, అదే లుక్ లో రణబీర్‌ను చూపించబోతున్నారు. మేకింగ్ పరంగా రామాయణం హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా ఉందని టీజర్ తోనే నిర్ధారించారు.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు

Follow Us