Ramayana Part 1: హనుమాన్ ఎంట్రీ.. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ పక్కా..
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన ‘రామాయణం పార్ట్ 1’ క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్ సీన్‌పై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సీతాపహరణం, జటాయువు మరణంతో కథ ముగుస్తుందని, చివర్లో సన్నీ డియోల్ హనుమంతుడిగా పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. హనుమాన్ చాలీసా నేపథ్యంలో ‘జై శ్రీరామ్’ అంటూ గర్జించే సన్నివేశం పార్ట్ 2పై అంచనాలను పెంచుతోందని అభిమానులు చర్చిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణం పార్ట్ 1’. తాజాగా ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా.. ఈ మూవీ ఇప్పుడు మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్ సీన్‌కు సంబంధించిన కీలక వివరాలు నెట్టింట లీక్ కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. రావణుడిచే సీత అపహరణ , ఆమెను రక్షించే ప్రయత్నంలో జటాయువు తన ప్రాణాలను త్యాగం చేసి విషాదకరంగా మరణించడంతో కథ ఒక భావోద్వేగ మలుపు తీసుకుంటుంది. ఈ సంఘటనలతో తీవ్రంగా కలత చెందిన శ్రీరాముడు, సీతను రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తాడు. ఆయన సంకల్పం ఒక గొప్ప ప్రయాణానికి నాంది పలుకుతుంది, అది చివరికి రావణుడితో జరిగే ఒక మహా సంగ్రామానికి దారితీస్తుంది. సినిమా ముగింపు దశకు చేరుకుంటుండగా, ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల పేర్లు కనిపిస్తాయి. ఇదంతా పక్కన పెడితే అదే సమయంలో హనుమంతుడి ఎంట్రీ సీన్ చూపించారు. అందులో సన్నీ డియోల్ ముఖం చూపించలేదు.. కానీ ఆయన భారీ శారీరక రూపాన్ని అద్భుతమైన విజువల్ ద్వారా చూపించారు. దీంతో ఒక్కసారిగా రామాయణం పార్ట్ 2 పై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో పవర్ఫుల్ అంజనేయ స్వామి లేదా హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ముగింపు దశలో.. సరిగ్గా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో హనుమంతుడి పాత్రను పరిచయం చేసే సన్నీ డియోల్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమాన్ చాలీసా మ్రోగుతుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా గాల్లోకి ఎగురుతూ, అమితమైన బలాన్ని ప్రదర్శించే దృశ్యం ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించేలా ఉందని అంటున్నారు. ఈ సీన్ చివర్లో హనుమంతుడు “జై శ్రీరామ్” అని గర్జించే షాట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమాను సీతారాముల వనవాసం, సీతాపహరణం వంటి ఎమోషనల్ పాయింట్‌తో ముగించి, పార్ట్ 2పై భారీ క్యూరియోసిటీని పెంచేలా ఈ హనుమంతుడి ఎంట్రీని ప్లాన్ చేశారు మేకర్స్. ఇక జనవరిలో సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2028 దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో రోహిత్‌కు అవమానం! AV వేయకపోవడానికి అసలు కారణం ఇదేనా..
60 ఏళ్ల వయసులో పెళ్లి.. విడాలకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు
రామాయణ పార్ట్ 1 రిలీజ్ అయిన వేళ.. బాంబు పేల్చిన ప్రొడ్యూసర్
రాధికాకు.. SKN దిమ్మతిరిగే కౌంటర్
బాలీవుడ్ హీరోకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చూస్తూ ధమ్కీ
