Ram Charan: వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?

|

Jan 03, 2025 | 12:04 PM

ట్రిపుల్ ఆర్, ఆచార్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ గా మన ముందుకు రానున్నాడు. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాజకీయ నాయకుడిగానూ, ఐఏఎస్ అధికారిగానూ కనిపించనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య, సునీల్ ఇలా స్టార్ నటులంతా గేమ్ ఛేంజర్ సినిమాలో సందడి చేయనున్నారు.

ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో స్టైలిష్ గా ఉంటాడు రామ్ చరణ్. అలా అన్ స్టాపబుల్ షోకు కూడా స్టైలిష్ గా ముస్తాబై వచ్చాడు గ్లోబల్ స్టార్. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ డిజైన్ తో ఉన్న హుడీ తో బాలయ్య షోలో సందడి చేశాడు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అభిమానులు ఈ హుడీ గురించి నెట్టింట తెగ వెతికారు. ఈ క్రమంలోనే చరణ్ ధరించిన అమిరి బ్రాండ్ హుడీ అసలు ధర ఒక లక్ష 10 వేలకు పైగానే ఉందని తెలుస్తోంది. అయితే డిస్కౌంట్ లో ఆన్ లైన్ లో 88 వేలకు వస్తుంది. దీంతో ఈ ధర చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఈసారి సంక్రాంతి బరిలో బాలయ్య, రామ్ చరణ్ సినిమాలు ఉన్ాయి. గేమ్ ఛేంజర్ గా గ్లోబల్ స్టార్, డాకూ మహారాజ్ గా బాలయ్య థియేటర్లలో సందడి చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.