Ram Charan: ఒకటి కాదు రెండు.. చరణ్‌కు లెక్కల మాస్టారు ట్విస్ట్

Edited By:

Updated on: Feb 20, 2026 | 5:21 PM

గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ కథకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, తర్వాతి ప్రాజెక్ట్ RC17 కోసం సుకుమార్‌తో చేతులు కలుపుతున్నారు. సుకుమార్ చరణ్ కోసం రెండు విభిన్న కథలను సిద్ధం చేశారు – ఒకటి ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకు టచ్ చేయని కొత్త కాన్సెప్ట్ కాగా, మరొకటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. 'పెద్ది' విడుదలయ్యాక ఏ కథ ఖరారవుతుందో తెలుస్తుంది. ఈ చిత్రం జూన్ నుండి సెట్స్‌పైకి వస్తుంది.

రామ్ చరణ్, సుకుమార్ RC17 విషయంలో ఏం జరుగుతుంది..? ఏం జరుగుతుంది హాయిగా లెక్కల మాస్టారు కథ రాసుకుంటుంటే.. ఇక్కడ పెద్ది బ్యాలెన్స్ చరణ్ పూర్తి చేస్తున్నాడు. ఇంకేం జరుగుతుంది అనుకుంటున్నారా..? కానీ తెరవెనక వేరే ఇంకేదో జరుగుతుంది. ఆ ఇంకేదో ఏంటనేది డీటైల్డ్‌గా ఇక్కడ చూద్దాం పదండి.. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ ఆలోచనలు మారిపోయాయి. భారీతనం కంటే కూడా కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకే సినిమా అనుభవం ఉన్నా కూడా బుచ్చిబాబు కథ నచ్చి పెద్ది చేస్తున్నారు. ఈ సినిమా రంగస్థలంను మించి ఉంటుందని హామీ ఇస్తున్నారీయన. చిట్టిబాబును మించే పాత్ర పెద్దిలో చరణ్‌కు రాసారు బుచ్చి. పెద్ది షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతుంది. దీని తర్వాత సుకుమార్ సినిమాకు ఓకే చెప్పారు చరణ్. రంగస్థలం, పుష్ప తర్వాత లెక్కల మాస్టారు చేయబోయే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. ఇప్పటికే చరణ్ కోసం కథ సిద్ధం చేసిన సుక్కు.. ఇప్పుడు రెండో కథ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై టచ్ చేయని ఓ కొత్త కథను ట్రై చేయబోతున్నారు సుకుమార్. దాంతో పాటు పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లోనూ మరో కథను చరణ్‌కు చెప్తే.. అది కూడా నచ్చిందని తెలుస్తుంది. ఈ రెండింట్లో ఏది మెటిరియలైజ్ అవుతుందనేది తెలియాలంటే పెద్ది విడుదలయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: గ్యాప్ ఇవ్వలేదు.. తీసుకున్నా అంటున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా

ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ

ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

చిన్నారిని క్యాబ్‌లో మరిచిన తల్లితండ్రులు.. చివరికి ??

Follow Us