Raaka: ఇదే నా మాట.. రాకా రేంజ్ హాలీవుడ్డే

Edited By:

Updated on: May 12, 2026 | 12:02 PM

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న 'రాకా' చిత్రం ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చనుంది. ₹600 కోట్లకు పైగా బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్, ప్యారలల్ వరల్డ్ కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోంది. అట్లీ తాజా అప్డేట్‌తో బాలీవుడ్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి, హాలీవుడ్ టీమ్ పనితీరు స్పష్టమవుతున్నాయి. ఈ ప్రయోగం భారతీయ సినిమాకు కొత్త ఒరవడిని సృష్టించనుంది.

అల్లు అర్జున్ రాకా సినిమా ఎలా ఉండబోతుంది..? ఇప్పటి వరకు వచ్చిన ఒకట్రెండు వీడియోలతోనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ అయితే ఇచ్చేసారు మేకర్స్. తాజాగా దర్శకుడు అట్లీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈయన మాటలు వింటే.. ఇండియన్ సినిమాలో ఏదో అద్భుతం జరగబోతుందని అర్థమైపోతుంది. మరింతకీ అట్లీ ఏమంటున్నారు..? అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకా సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రాబోతుంది రాకా. మేకింగ్ వీడియోతోనే తన సినిమా గ్రాండ్ నెస్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అట్లీ. సైన్స్ ఫిక్షన్‌తో పాటు ప్యారలల్ వరల్డ్‌కు సంబంధించిన స్టోరీ ఇది. అట్లీ అండ్ టీం ఫోకస్ అంతా సౌత్ కంటే ఎక్కువగా నార్త్ మార్కెట్‌పైనే ఉంది. పుష్ప 2తో ఎలాగూ బన్నీకి బాలీవుడ్‌లో నెక్ట్స్ లెవల్ మార్కెట్ వచ్చేసింది.. అలాగే జవాన్‌తో అట్లీ కూడా అక్కడ పాగా వేసారు. దాంతో రాకా కోసం పోటీ పడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. మేమంటే మేం అంటూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. రాకా సినిమాను అట్లీ పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పారు అట్లీ. తమకు టైమ్ కావాలని.. తాము చేస్తున్న సినిమా ఛాలెంజింగ్‌గా ఉంటుందని.. మేకింగ్ అంత ఈజీ ఏం కాదన్నారు అట్లీ. తమకు కాస్త టైమ్ ఇస్తే.. ఇండియన్ సినిమా ఇదివరకు చూడని అద్భుతం చూపిస్తామని కొన్ని నెలల కిందే చెప్పారు ఈ దర్శకుడు. అల్లు అర్జున్ కూడా రాకా కోసం ఊహిచనంతగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసం పూర్తిగా హాలీవుడ్ టీం పని చేస్తుంది. బడ్జెట్ కూడా 600 కోట్లు దాటేలా ఉంది. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన అట్లీ, అల్లు అర్జున్.. రాకా కోసం కొత్త ప్రయోగం చేస్తున్నారు. మరి ఈ ఎక్స్‌పర్మెంట్‌తో ఇండియన్ సినిమా ముఖచిత్రం మార్చేస్తారా అనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??

Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??

Follow Us