RRR Wins Oscar: ఈ ఒక్కడి వల్లే.. జక్కన్న ఆస్కార్ కల నెరవేరింది.. వీడియో.
మీకు రాజమౌళే కనిపివచ్చు.! ఎన్టీఆర్.. రామ్ చరణే ముందుండి నడిపించారని అనిపించవచ్చు! ఆస్కార్ కల వీరి వళ్లే సాధ్యమైందనే టాక్ త్రూ అవుట్ ఇండియా రావచ్చు. కానీ ఇది నిజం కాదు! కష్టం అసలు వీళ్లది కానే కాదు..! మరి ఎవరిది?
మీకు రాజమౌళే కనిపివచ్చు.! ఎన్టీఆర్.. రామ్ చరణే ముందుండి నడిపించారని అనిపించవచ్చు! ఆస్కార్ కల వీరి వళ్లే సాధ్యమైందనే టాక్ త్రూ అవుట్ ఇండియా రావచ్చు. కానీ ఇది నిజం కాదు! కష్టం అసలు వీళ్లది కానే కాదు..! మరి ఎవరిది? ఆ ఒక్కడిది..! కార్తియుడుది.! పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి కొడుకుగా.. తెలుగు టూ స్టేట్స్‌లో ఇప్పటికే గుర్తింపు పొందిన కార్తీకేయ.. జక్కన్నకు కొడుకు మాత్రమే కాదు.. హోల్ అండ్ సోల్. జక్కన్న కష్టం వెనక ఉన్న వన్ అండ ఓన్లీ మ్యాన్. ఆస్కార్ ప్రమోషన్స్ వెనుకు ఉన్న మాస్టర్ మైండ్! ఎస్ ! ఎంత పెద్ద సినిమాకు అయినా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వరకే పరిమితమయ్యే జక్కన్న.. మిగతా పనులన్నీ కార్తికేయ కే అప్పగిస్తుంటారు. తను ఆ పనులన్నీ చేస్తుంటేనే.. జక్కన్న ఫోకస్డ్‌గా డైరెక్షన్ చేస్తుంటారు. అందుకే బాహుబలి.. ట్రిపుల్ఆ ర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించగలిగారు. పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారగలిగారు. ఇక ఈ క్రమంలోనే తన ఫాదర్ జక్కన్నకున్న ఆస్కార్ డ్రీమ్ ను కూడా తన నెత్తినేసుకున్నారు కార్తికేయ. ట్రిపుల్ ఆర్ సినిమాను చాలా ప్లాన్డ్‌గా హాలీవుడ్‌లో దించడమే కాదు.. అక్కడే తిష్ట వేసి అన్ని ప్రమోషన్స్ ను దగ్గరుండి మరీ చూసుకున్నారు. పీఆర్ టీమ్స్ తో టచ్‌లో ఉంటూ.. ఆస్కార్ ప్రపబుల్ లిస్టులో ట్రిపుల్ ఆర్కు ఎంట్రీ దక్కేలా చేశారు. ఇక ఆస్కార్ నామినేషన్స్ ముందు ట్రిపుల్ ఆర్ మేనియా అమెరికా గడ్డపై పీక్స్‌లోకెళ్లేలా చేశారు. అందుకోసం తన తండ్రి జక్కన్న. చెర్రీ, తారక్‌తో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు. స్పెషల్ స్క్రీన్స్‌ను అరెంజ్ చేశారు. అలా పీఆర్ టీంతో కష్టపడుతూనే.. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లేలే చేశారు. అందుకే ఆస్కార్ గెలిచిన తరువాత.. ఆస్కార్ స్టేజ్ మీద నుంచే.. కీరవాణి కార్తికేయకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. కార్తికేయ వల్లే ఇది సాధ్యమైందంటూ.. ఆ తరువాత మీడియాతో కూడా కోట్ చేశారు. అలా ఈ జూనియర్ జక్కన్నే ఆస్కార్ గెలవడానికి కారణమయ్యారు. రియల్ హీరో అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!