ధురంధర్2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్ 2 సినిమా ప్రభంజనంలో 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అద్భుతమైన వసూళ్లతో ఆకట్టుకుంటోంది. ర్యాన్ గాస్లింగ్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹2800 కోట్లకు పైగా, ఇండియాలో 4 రోజుల్లో ₹18 కోట్లకు పైగా సాధించి, సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. అద్భుతమైన విజువల్స్, వినూత్న కథాంశంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.
‘ధురంధర్ ది రివేంజ్’ కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మార్చి 19న విడుదలైన ఈ క్రేజీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.1500 కోట్లను దాటేసిన ధురంధర్ 2 రూ.2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా ధాటికి ఇతర చిత్రాలు తట్టుకోలేకపోతున్నాయి. కనీసం పోటీలో కూడా లేకుండా పోతున్నాయి. అయితే ఈ ధురంధర్ 2 ప్రభంజనంలోనూ ఒక సినిమా కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వారం క్రితమే విదేశాల్లో విడుదలై అద్భుతమైన టాక్ సొంతం చేసుకున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, గత వీకెండ్ మన దేశంలోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో భారీ అంచనాల మధ్య ఉన్న ‘ధురంధర్ 2’ వంటి పెద్ద సినిమా పోటీని సైతం తట్టుకుని, ఈ చిత్రం నిలకడగా కలెక్షన్లు రాబడుతుండటం విశేషం. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తూ మంచి వసూళ్లను సాధిస్తోంది. సినిమాలోని విజువల్స్ మరియు నటీనటుల ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో రణ్ వీర్ సింగ్ ధురంధర్ 2 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మాత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఆడియెన్స్ కు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజైన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 300 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.2800 కోట్లు. అంతేకాదు రోజు రోజుకు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ వసూళ్లు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. ఇక మన దేశంలోనూ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ మూవీకి అనూహ్యమైన ఆదరణ దక్కుతోంది. కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే ఈ సినిమాను ప్రదర్శిస్తున్నప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చాలా చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా హౌస్‌పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సినిమా కథ విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి తన గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది ఈ సినిమా కథ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ ఈ సినిమాలో విజువల్స్ అదిరిపోయాయని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిరాణా వ్యాపారికి ఫోన్ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే
ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్ విజయ్‌కే
రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది
