ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా

Updated on: Mar 27, 2026 | 7:34 PM

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్ 2' వేల కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టినా, మరోవైపు ఓటీటీలో చిన్న సినిమా 'మేడ్ ఇన్ కొరియా' అనూహ్య సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంక మోహన్ నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నాన్-ఇంగ్లీష్ కేటగిరీలో 'ధురంధర్ 2'ని అధిగమించి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ ఓటీటీ సినిమా సాధించిన అద్భుత విజయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ధరంధర్ 2 సినిమా దుమ్మురేపుతుంది. ఉగాది కానుకగా రిలీజైన ధురందర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంటెన్స్ డ్రామాతో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధురంధర్ 2 సినిమా ఇప్పటికే అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ధరంధర్ 2 మూవీ రూ. 1000క్లొట్ల మార్క్ ను దాటేసింది.అయితే ధురంధర్ 2 హాట్ టాపిక్ అవుతున్న వేళ.. ధురంధర్ పార్ట్ 1 సినిమాను వెనక్కి నెట్టి మరీ.. ఓ చిన్న సినిమా… ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకండా వచ్చిన ఓ చిన్న సినిమా.. అది కూడా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ధురంధర్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’. మార్చి 12న ఈ సినిమా.. నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలోకి వచ్చిన మేడ్ ఇన్ కొరియా సినిమా.. మొదటి వారంలోనే నంబర్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాదు ఇప్పటికీ అంటే రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ -ఇంగ్లీష్ కేటగిరీలో దురంధర్‌ చిత్రాన్ని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది ఈ చిన్న సినిమా. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి

డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు

Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే

Follow Us