Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా

Edited By:

Updated on: Mar 14, 2026 | 6:57 PM

ప్రియాంక చోప్రా భాషా నైపుణ్యాలు, ఆలోచనా విధానం, సక్సెస్ జర్నీ అందరికీ స్ఫూర్తి. బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్నా, ఐశ్వర్య రాయ్ స్ఫూర్తితో హాలీవుడ్‌కు అడుగులేశారు. కంఫర్ట్ జోన్‌ను వీడి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే ఆమె తత్వం ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు చిత్రంలోకి రావడానికి కారణమా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ప్రియాంక చోప్రాని దగ్గరగా గమనించిన వారు ఆమె లాంగ్వేజ్‌ స్కిల్స్ ని మెచ్చుకుంటారు. ఆమె థాట్‌ ప్రాసెస్‌ని గుర్తుచేసుకుంటారు. ఆమె ట్రావెల్‌ చేసిన రూట్‌ చూసి ఇన్‌స్పయిర్‌ అవుతారు. ఆమె సక్సెస్‌ని డీకోడ్‌ చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. వాళ్లూ వీళ్లూ చెప్పడం సంగతి సరే… ఇంతకీ ప్రియాంక ఏం చెబుతున్నారు? దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా గురించి ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే, ఎక్కడో ఉన్న లేడీ గురించి మాట్లాడినట్టు అనిపించేది. కానీ ఇప్పుడు ఆమె వారణాసిలో పార్ట్ అయ్యాక ఆమెకు సంబంధించిన ప్రతిదీ మనకే సొంతమైన ఫీలింగ్‌ వచ్చేస్తోంది. రాజమౌళి సినిమా విషయంలో గతంలో చాలా మంది చేయని సాహసాన్ని చేసి అందరికీ వావ్‌ ఫ్యాక్టర్‌ గా మారారు దేశీ గర్ల్. ఆమె ఇచ్చినన్ని లీకులు ఎవరూ ఇవ్వడం లేదంటూ ఆమెకు నాన్‌స్టాప్‌గా థాంక్స్ చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. కెరీర్‌ బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌ వైపు అడుగులేశారు ప్రియాంక చోప్రా. అసలు ఆమెను అటు వైపు నడిపిన అంశమేంటి? అని అడిగితే, ఇంట్రస్టింగ్‌గా ఆన్సర్‌ చేశారీ బ్యూటీ. ‘ ఆ టైమ్‌ లో నాకు బాలీవుడ్‌ చాలా చిన్నగా అనిపించింది. ఐశ్వర్య రాయ్‌ లాంటి వారు హాలీవుడ్‌ని ఎక్స్ ప్లోర్‌ చేశారు. అందుకే నేను అటు వైపుగా నడవాలనుకున్నా’ అంటూ తనను ఇన్‌స్పయిర్‌ చేసిన ఐష్‌ గురించి చెప్పేశారు ప్రియాంక. నటిగా వింగ్స్ స్ప్రెడ్‌ చేయాలనుకున్న ప్రతిసారీ కంఫర్ట్ జోన్‌ ని వదిలేస్తుంటానన్నది ప్రియాంక చోప్రా చెప్పిన మాట. ఇప్పుడు రాజమౌళి – మహేష్‌ మూవీకి కూడా ఆమె అందుకే సైన్‌ చేశారా? సరికొత్త సరిహద్దులను ఎక్స్ ప్లోర్‌ చేయాలన్న కలలతోనే ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టారా? అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య

Follow Us