ప్రభాస్ సంచలన నిర్ణయం.. వాళ్ల పరిస్థితేంటి..?

Updated on: Feb 14, 2026 | 2:46 PM

బాహుబలి తర్వాత దర్శకుల విషయంలో ప్రభాస్ నమ్మకం తరచుగా వమ్ము కావడంతో, రెబల్ స్టార్ తన పంథాను మార్చుకుంటున్నారు. చిన్న దర్శకులకు అవకాశాలు ఇవ్వకుండా, ఇకపై భారీ ప్రాజెక్టుల కోసం పేరున్న, నిరూపితమైన దర్శకులతో మాత్రమే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక నిర్ణయం వెనుక గత చిత్రాల అనుభవాలు ఉన్నాయి.

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. అయితే, ఆయన కెరీర్‌లో దర్శకుల ఎంపిక విషయంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కథ నచ్చితే కొత్త లేదా మధ్య స్థాయి దర్శకులతో పనిచేయడానికి ప్రభాస్ ఎప్పుడూ సంకోచించలేదు. ప్రశాంత్ నీల్ మినహా, బాహుబలి అనంతరం ఆయనతో పనిచేసిన చాలామంది దర్శకులు మీడియం రేంజ్‌కు చెందినవారే. రన్ రాజా రన్ వంటి చిన్న చిత్రం తీసిన సుజీత్ వంటి దర్శకులను నమ్మి సాహో వంటి భారీ ప్రాజెక్టులు చేశారు. సాహో హిందీలో విజయం సాధించినా, ఆ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్, ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ విమర్శలను ఎదుర్కొన్నాయి. ఈ చిత్రాలు ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టలేక పోయాయి.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?