Prabhas: ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్.. 40% షూట్ పూర్తి, రిలీజ్‌పై క్లారిటీ!

Edited By:

Updated on: Jul 21, 2026 | 7:25 PM

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోందని దర్శకుడు స్పష్టం చేశారు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తైందని, మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

డార్లింగ్ ప్రభాస్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రోజు నుంచే ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా డిలే అవుతుందంటూ వస్తున్న రూమర్స్‌కు ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో చెక్ పెడుతూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన అప్‌డేట్ డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో జోష్ తీసుకువచ్చింది? డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ స్టేటస్‌ ఏంటి? అసలు అనుకున్న టైమ్‌కి సినిమా రిలీజ్ అవుతుందా లేదా? అని ఫ్యాన్స్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉన్న టైమ్‌లో సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. రీసెంట్‌ ఈవెంట్‌లో స్పిరిట్ సినిమా తాము ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే పూర్తవుతుందన్నారు. అంతేకాదు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. మిగతా 60 శాతం బ్యాలెన్స్ కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా కంప్లీట్ చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ఉంది మూవీ టీమ్. షూటింగ్ డిలే అవుతోందని, సినిమా పోస్ట్‌పోన్ అవుతుందన్న రూమర్స్‌కు ఈ అప్‌డేట్‌తో చెక్‌ పెట్టారు. ఎలాంటి ఆలస్యం లేకుండా, గతంలో ప్రకటించినట్లుగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా స్పిరిట్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని సందీప్ చెప్పిన మాటలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ మార్క్ వయొలెన్స్, ఎమోషనల్ డ్రామాకు ప్రభాస్ కటౌట్ తోడైతే థియేటర్లలో పూనకాలు ఖాయమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వంగా.. స్పిరిట్‌ను తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంద కోట్ల హీరోలు.. కానీ ఇంకా టైర్-1 కాదు! ఈ సినిమాలే వారి కెరీర్‌ను మార్చేస్తాయా?

Ram Charan: చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రష్మిక, కియారా, రుక్మిణి మధ్య హాట్ రేస్!

టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?

షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే

Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?

Follow Us