Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..

Edited By:

Updated on: Apr 11, 2026 | 4:16 PM

ప్రభాస్, సందీప్ వంగా 'ధురంధర్ 2' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. 'స్పిరిట్' కోసం ధురంధర్ 2 మేకింగ్, రణ్‌వీర్ సింగ్ యాక్షన్ స్టైల్‌ను అధ్యయనం చేశారు. వంగా ఇండియన్ సినిమా మేకింగ్‌ను మార్చారు, ఇప్పుడు ఆదిత్య ధర్ స్టైల్‌ను పరిశీలిస్తున్నారు. 'స్పిరిట్'లో ప్రభాస్ పాత్ర, యాక్షన్ ఇలాగే ఉండవచ్చని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వీక్షణ 'స్పిరిట్'పై అంచనాలను రెట్టింపు చేసింది, బాక్సాఫీస్ వద్ద మరో సునామీ ఖాయం.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ధురంధర్ 2ను ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి స్పెషల్‌గా చూడటం వెనుక అసలు కథేంటి..? ఇండియన్ సినిమా మేకింగ్‌ స్టైల్ మార్చేసిన వంగా.. ఇప్పుడు స్పిరిట్ కోసం ఆదిత్య ధర్ యాక్షన్ స్టైల్‌ను అప్లై చేయబోతున్నారా..? రణ్‌వీర్ సింగ్ రా అండ్ రస్టిక్ పెర్ఫార్మెన్స్‌ చూసి ప్రభాస్ రియాక్షన్ ఏంటి..? అసలేంటి కథ..? కోకాపేట‌్ అల్లు సినిమాస్‌లో ధురంధర్ 2 స్పెషల్ షో చూసిన ప్రభాస్, సందీప్ వంగా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయిప్పుడు. స్పిరిట్ షూటింగ్ గ్యాప్‌లో వచ్చిన ప్రభాస్.. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఏకంగా సీట్లోంచి నిలబడి మరీ చూశారంటే ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 1700 కోట్లు క్రాస్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్‌నే మార్చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన పాత్ బ్రేకింగ్ సినిమా ధురంధర్ 2 మేకింగ్‌ను వంగా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం ఇలాంటి కొత్త యాక్షన్ ఎలిమెంట్స్ ఏమైనా అప్లై చేసే ఆలోచనలో వంగా ఉన్నారా అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఈ స్క్రీనింగ్‌లో కేవలం మేకింగ్ మాత్రమే కాకుండా రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్‌ను కూడా ప్రభాస్ చాలా స్పెషల్‌గా గమనించినట్లు ఆయన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. స్పిరిట్‌లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా ఇదే తరహాలో ఉండబోతోందా అన్నది ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను ఏలుతున్న ప్రభాస్.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా కలిసి ఇలా ఒక సినిమాను స్టడీ చేయడం స్పిరిట్‌పై అంచనాలను డబుల్ చేస్తోంది. స్పిరిట్‌ను కూడా ఇదే లెవల్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో ప్లాన్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర మరో సునామీ ఖాయం. అసలు వీళ్లిద్దరి మైండ్‌లో ఏముందనేది సినిమా రిలీజ్ అయితే కానీ పూర్తిగా అర్థం కాదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్

రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు

వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే

Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా

Follow Us