ఢీ అంటున్న ప్రభాస్‌, బాలయ్య.. సై అనేదెవరు? సైడిచ్చేదెవరు?

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:28 AM

టాలీవుడ్‌లో డిసెంబర్ విడుదలల కోసం పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' డిసెంబర్ 3 విడుదలను ప్రకటించడంతో ఇతర స్టార్ హీరోలు తమ రిలీజ్ ప్లాన్స్‌ను పునఃసమీక్షిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'NBK111'ను క్రిస్మస్ సీజన్‌కు మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏడాది చివరి బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌లో సంక్రాంతి, సమ్మర్ సీజన్ల లాగే, డిసెంబర్ కూడా కీలకంగా మారింది. అందుకే టాప్ స్టార్స్ ఈ సీజన్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏడాది కూడా డిసెంబర్‌ సీజన్ టార్గెట్‌గా ఇంట్రస్టింగ్ మూవీస్‌ రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల్లో ఏవేవి తలపడితాయి..? ఏవి తప్పుకుంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ స్టార్స్‌కు డిసెంబర్ అనేది ఎప్పుడూ ఒక గోల్డెన్ సీజన్. ఈ సీజన్‌లో రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్స్ కలిసివచ్చి సినిమా ఈజీగా హిట్ ట్రాక్ ఎక్కేస్తుందన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అందుకే పాన్ ఇండియా స్టార్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ అంతా డిసెంబర్ డేట్స్ మీదే ఫోకస్ చేస్తుంటారు. 2026 డిసెంబర్ డేట్స్ మీద ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు స్టార్స్‌. ఆల్రెడీ డార్లింగ్‌ ప్రభాస్‌ ఇదే సీజన్‌లో ఫౌజీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫౌజీ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ రిలీజ్ అంటే దాదాపు అన్ని థియేటర్లలో అదే సినిమా ఉంటుంది. ఓపెనింగ్స్ విషయంలోనూ భారీ నెంబర్స్ రికార్డ్ అవుతాయి. అందుకే డార్లింగ్ ఎనౌన్స్‌మెంట్ తరువాత అదే సీజన్‌లో రావాలనుకున్న స్టార్స్ ఆలోచనలో పడ్డారు. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘NBK 111’ను ముందు డిసెంబర్ 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో యూనిట్ పునరాలోచనలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌ మూవీతో పోటీ పడటం కన్నా మరో డేట్‌కు వెళ్లటం బెటర్‌ అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముందు అనుకున్నట్టుగా డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌లో కాకుండా డిసెంబర్ థర్డ్ వీక్‌లో క్రిస్మస్‌ కానుకగా ఎన్బీకే 111ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్‌ 24న రిలీజ్ చేస్తే క్రిస్మస్ హాలీడేస్‌ కూడా కలిసొస్తాయన్న ఆలోచనలో ఉందట బాలయ్య టీమ్‌. మరి ఫైనల్‌గా ఏ మూవీ ఏ డేట్‌కు ఆడియన్స్‌ ముందుకు వస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OG 2: ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు..? పవన్‌, సుజీత్‌ ప్లానింగ్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు.. 8000 థియేటర్లలో రిలీజ్‌

ప్రతి సినిమాకు కొత్త అవతారం… స్టార్ హీరోల మేకోవర్ వెనక భారీ కష్టం..!

Deepika Padukone: ప్రెగ్నెంట్‌గా ఉండి రిస్కీ స్టంట్స్‌.. దీపిక డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఇండస్ట్రీ

పెళ్లి తర్వాతే అసలైన జోరు… మ్యారీడ్ హీరోయిన్లదే ఇప్పుడు ఇండస్ట్రీలో హవా..!

 

Follow Us