‘ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..’ ఆహాలో మంచి సిరీస్

Updated on: Apr 20, 2026 | 4:10 PM

ఆహాలో విడుదలైన పోచమ్మ వెబ్ సిరీస్ ఒక ఆసక్తికర మిస్టికల్ థ్రిల్లర్. దర్శకుడు రమేష్ ఇంద్ర కథనాన్ని వేగంగా, ఉత్కంఠభరితంగా నడిపారు. దేవుడి ఆగ్రహం, రివెంజ్ క్రైమ్ డ్రామా కలయికలో సస్పెన్స్ మెయింటైన్ చేశారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సిరీస్‌కు బలం. అద్భుతమైన నటన, క్రిస్ప్ ఎడిటింగ్‌తో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తప్పక చూడాల్సిన మిస్టికల్ థ్రిల్లర్.

దర్శకుడు రమేష్ ఇంద్ర ఈ సిరీస్ కథనాన్ని చాలా వరకు వేగంగా, ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించే ప్రయత్నం చేశాడు. మొదటి ఎపిసోడ్ లోనే కథా నేపథ్యాన్ని, బంగ్లా వాతావరణాన్ని, పోచమ్మ తల్లి విగ్రహం తొలగింపు ద్వారా వచ్చే కాన్ ఫ్లిక్ట్ ను చాలా ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేశాడు. దేవుడి ఆగ్రహం అనే మిస్టికల్ పాయింట్‌కు, ఒక రివేంజ్ క్రైమ్ డ్రామాకు ముడిపెట్టిన విధానం బాగుంది. ఈ హత్యలు దేవుడి వల్ల జరుగుతున్నాయా లేక మనుషుల వల్ల జరుగుతున్నాయా అనే సస్పెన్స్‌ను దర్శకుడు స్క్రీన్ ప్లే ద్వారా ప్రేక్షకుల్లో మెయింటైన్ చేయగలిగాడు. కథను మొదలుపెట్టిన విధానం బాగుంది.. ప్రతీ సీన్ కూడా అమ్మవారిని ఎలివేట్ చేసుకుంటూ వెళ్లిపోయారు.. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి.. కథను ముందుకు వెనక్కీ జరుపుకుంటూ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసాడు దర్శకుడు రమేష్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 5వ ఎపిసోడ్ వరకు కూడా ఎక్కడా కథనం నెమ్మదించలేదు. ముఖ్యంగా నిడివి కూడా తక్కువగానే ఉండటంతో బోర్ కొట్టదు. అక్కడక్కడా చిన్నచిన్న లోపాలున్నా పెద్దగా కనబడవు. ప్రధానంగా ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ కథనంలో ఆసక్తి పెరిగింది. మధ్యలో కొన్ని ట్విస్టులను ముందుగానే పసిగట్టేలా ఉన్నా కూడా కథనం బాగానే ఉంది. హారర్ థ్రిల్లర్స్ రెగ్యులర్‌గా చూసేవారికి ఇందులో ట్విస్టులు అర్థం అవ్వొచ్చు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎందుకో కాస్త రాసుకున్నట్లు అనిపిస్తుంది. పాత్రల మధ్య బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు.. పాత్రల నేపథ్యాలను ఇంకాస్త లోతుగా రాసుకుని ఉంటే సిరీస్ రేంజ్ మరింత పెరిగేది. పోచమ్మ తల్లి ఆగ్రహం గురించి మరికొన్ని బలమైన సన్నివేశాలు పడుంటే సిరీస్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లుండేది.. అయినా కూడా చాలా వరకు అద్భుతమైన కథనంతో ముందుకెళ్లింది. ముఖ్యంగా 4,5 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి.. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నాడు దర్శకుడు రమేష్. అచ్యుత్ కుమార్ క్యారెక్టరైజేషన్ సిరీస్‌కు ప్లస్ అయింది.. అలాగే స్నేహల్ కామత్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఓ మంచి మిస్టికల్ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్లకు పోచమ్మ బెస్ట్ ఛాయిస్. దర్శకుడు రమేష్ ఇంద్ర ఇందులో కీలకమైన బంగ్లా ఓనర్ పాత్ర చేసారు. ఆయన తన పాత్రకు న్యాయం చేసారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ఈ సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. తన లుక్, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఆ పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఫీమేల్ లీడ్‌గా చేసిన స్నేహల్ కామత్ తన పరిధి మేరకు మెప్పించింది. కన్నడ సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ నటన సిరీస్‌కు ప్లస్ అయ్యింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసారాయన. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం ఎల్.వి. ముత్తు గణేష్ అందించిన నేపథ్య సంగీతం. హారర్, మిస్టికల్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన BGM సిరీస్ స్థాయిని పెంచింది. వాతావరణాన్ని భయానకంగా మార్చడంలో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. లైటింగ్, కెమెరా యాంగిల్స్ తో బంగ్లాను, రాత్రి పూట జరిగే సన్నివేశాలను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. అనవసరమైన సాగదీతలు లేకుండా కేవలం 5 ఎపిసోడ్లకే పరిమితం చేయడం మంచి నిర్ణయం. దర్శకుడు రమేష్ ఇంద్ర కథను బాగా డీల్ చేసారు. ఆహాలో మంచి సిరీస్ వచ్చిందనే చెప్పాలి. ఓవరాల్‌గా పోచమ్మ.. ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు

Follow Us