Peddi: కన్నడ కిర్రాక్‌ కలెక్షన్స్‌.. నెంబర్‌ 1గా హీరో మనోడే..!

Updated on: Jun 05, 2026 | 3:27 PM

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కర్ణాటకలో ప్రీమియర్ షోల ద్వారానే రూ.3.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. దీంతో కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. మరోవైపు ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వ్యూస్ సాధించి భారీ ఆదరణ పొందుతోంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ రామ్‌ చరణ్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. కర్ణాటక ప్రీమియర్‌ షోల కలెక్షన్లలో ‘పెద్ది’ సరికొత్త రికార్డును లిఖించింది. అక్కడ ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం రూ. 3.2 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన నంబర్ వన్ టాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న ‘ఓజీ’ 2.72 కోట్లు కలెక్ట్ చేయగా.. , ‘రాజా సాబ్’ 2.61 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ‘పుష్ప 2’ 2.55 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడీ సినిమా రికార్డులను ‘పెద్ది’ బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ పాటలోని కొన్ని పదాలను తొలగించి, దానికి బదులుగా ‘సొగసు సింగారం’ అనే పదంతో లిరిక్స్‌ను మార్చినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రస్తుతం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: టికెట్స్ తెగడంలో.. పెద్ది రికార్డ్

Follow Us