OG: టాటూ కారణంగా.. బయటపడ్డ OG కథ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. ఓజీ నుంచి వస్తున్న అప్‌డేట్స్ అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. తాజాగా రెండో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు.
అయితే పోస్టర్‌లోని టాట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన పోస్టర్‌లో పవన్ కల్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. దీపాల వెలుగులో వారిద్దరూ ఎంతో రొమాంటిక్‌గా ఉన్నారు. అయితే, అభిమానుల దృష్టి మొత్తం పవన్ కుడి చేతిపై ఉన్న ఒక టాటూపై పడింది. జపనీస్ భాషలో మూడు అక్షరాలతో ఉన్న ఆ టాటూ అర్థం ఏమిటని అందరూ ఆసక్తిగా నెట్టింట సెర్చింగ్ ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం, ఆ మూడు జపనీస్ అక్షరాలకు శక్తివంతమైన అర్థాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటి అక్షరానికి ‘ప్రామిస్’ వాగ్దానం, రెండో అక్షరానికి ‘స్ట్రెంగ్త్’ బలం, మూడో అక్షరానికి ‘ఫైర్’ నిప్పు అని అర్థం వస్తుందని అంటున్నారు. ఈ మూడు పదాలు సినిమాలో పవన్ పాత్ర స్వభావాన్ని, ఆయన లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్లింప్స్ ఇంకా మొదటి పాటతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ‘ఓజీ’పై ఈ టాటూ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీదేవి ఆస్తి కోసం చెన్నై హై కోర్టు మెట్లెక్కిన భర్త బోనీ కపూర్
మనోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పెళ్లే చేసుకోనన్న హీరోయిన్‌నే పడేశాడు?
శ్రీతేజ కుటుంబానికి అండగా.. తెలంగాణ సర్కార్