ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్.. స్టార్ బ్యూటీల కెరీర్ గ్రాఫ్ చెబుతున్న నిజాలు!

Edited By:

Updated on: Jul 17, 2026 | 4:22 PM

ప్యాన్ ఇండియా ట్రెండ్ హీరోలకు అవకాశాలు పెంచినా, పలువురు హీరోయిన్ల కెరీర్‌పై మాత్రం ప్రభావం చూపుతోందనే చర్చ సాగుతోంది. అనుష్క, పూజా హెగ్డే, సమంత, తమన్నా వంటి నటీమణులు ప్రాంతీయ సినిమాల్లో సత్తా చాటినా, ప్యాన్ ఇండియా ప్రాజెక్టుల తర్వాత కెరీర్ వేగం తగ్గింది. ప్రస్తుతం రష్మిక మందన్న మాత్రమే ఈ పోటీలో నిలదొక్కుకుంటూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

హీరోలకు ప్యాన్ ఇండియన్ ఇమేజ్ శ్రీ రామరక్షగా మారుతుందేమో గానీ.. హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఇది బ్యాగేజే..! ఓ విధంగా చెప్పాలంటే ఈ ప్యాన్ ఇండియన్ కల్చర్ మొదలయ్యాకే వాళ్ల కెరీర్ డ్యామేజ్ అవుతుంది. సౌత్ నార్త్ బ్యాలెన్స్ చేయలేక.. పాపం ఎటూ కాకుండా పోతున్నారు. అర్ధాంతరంగా కెరీర్ స్లో అయిపోతుంది. మరి అలా ఇబ్బంది పడుతున్న హీరోయిన్లెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. హీరోయిన్ల కెరీర్‌కు ప్యాన్ ఇండియన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందా.. ఈ ప్రశ్నకు సమాధానం కొన్నేళ్లుగా మన హీరోయిన్స్ కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. రీజనల్ సినిమాలు చేస్తున్నపుడు క్వీన్స్‌లా కెరీర్ లీడ్ చేసిన వాళ్లు.. ప్యాన్ ఇండియా అంటూ వెళ్లాక అటూ ఇటూ బ్యాలెన్స్ చేయలేక రేసులో వెనకబడిపోయారు. బాహుబలి 2తో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క.. ఆ తర్వాత అన్ని భాషల కోసం భాగమతి, నిశ్శబ్ధం సినిమాలు చేసారు. ప్యాన్ ఇండియా అని చెప్పినా.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని చివరి నిమిషంలో తెలుగుకే పరిమితం చేసారు. గతేడాది ఘాటీ కూడా నిరాశ పరిచింది. రీజినల్ సినిమాలు చేసినన్నాళ్లూ అనుష్క చక్రం తిప్పినా.. ప్యాన్ ఇండియాకు వెళ్లాకే ట్రాక్ తప్పారు. పూజా హెగ్డే కూడా తెలుగులో మాత్రమే నటించినన్ని రోజులు తిరుగులేదు.. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేసారు. కానీ రాధే శ్యామ్, బీస్ట్, కూలీ అంటూ ప్యాన్ ఇండియా వైపు వెళ్లి వెనకబడిపోయారు. హిందీ కూడా ఈమెకు కలిసిరాలేదు. మొన్నొచ్చిన కూలీ కూడా అంతే సంగతులు.. మోనికా పాట హిట్టైనా పూజా కెరీర్‌కు ఇది ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. సమంత సైతం తెలుగులో ఉన్నపుడు క్వీన్. అలా కాకుండా ప్యాన్ ఇండియా అన్నపుడే సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అందుకే మా ఇంటి బంగారం అంటూ తెలుగు సినిమాతోనే మళ్లీ హిట్ కొట్టారీమే. ఇక తమన్నా హీరోయిన్‌గా మానేసి స్పెషల్ సాంగ్స్‌పై ఫోకస్ చేసారు. ప్యాన్ ఇండియా కల్చర్ తట్టుకుని.. సస్టైన్ అవుతున్నది రష్మిక మందన్న మాత్రమే. ఇంకెన్నాళ్లు ఈమె దూకుడు సాగుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి తెచ్చిన లక్.. బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్..!

కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!

Follow Us