మొదలుపెట్టాక ఆపేదే లే అంటున్న స్టార్ హీరోలు
సినిమా ప్రారంభించడానికి నెలలు, సంవత్సరాలు తీసుకుంటున్న హీరోలు, దర్శకులు.. ఒకసారి సెట్స్‌పైకి వెళ్లాక మాత్రం జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, అనిల్ రావిపూడి, సింగీతం శ్రీనివాసరావు, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. భారీ గ్యాప్‌ల తర్వాత వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ విడుదల తేదీలను టార్గెట్ చేస్తున్నారు.
ఏదైనా మొదలుపెట్టనంత వరకే.. ఒక్కసారి వి స్టెప్ ఇన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అంటున్నారు మన దర్శకులు.. వాళ్లకు హీరోలు కూడా తోడవుతున్నారు. ఓ సినిమా అయ్యాక.. మరో సినిమా మొదలెట్టడానికి లేట్ అవుతుందేమో కానీ.. సెట్‌లోకి అడుగు పెట్టాక మాత్రం అస్సలు తగ్గట్లేదు. జెట్ స్పీడ్‌లో షూట్ పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య ఇదే ట్రెండ్ అయిపోయింది. మన శంకరవరప్రసాద్ గారు విడుదలయ్యాక.. 5 నెలలకు పైగానే గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి. మధ్యలో భుజానికి సర్జరీ కూడా అయింది. అయితే మే నెలాఖర్లో బాబీ సినిమా మొదలుపెట్టారు చిరు. అలా మొదలైందో లేదో.. అప్పుడే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. హైదరాబాద్‌తో పాటు పొల్లాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసారు బాబీ. అనిల్ రావిపూడి కూడా అంతే..! మార్చ్ నుంచి కథ రాయడం మొదలుపెట్టి మొన్నే పూర్తి చేసారు. జూన్ 18న వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు కొబ్బరికాయ్ కొట్టనున్నారు.. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఈ సినిమాను కూడా ఎప్పట్లాగే సంక్రాంతి రిలీజ్‌కే ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్‌తో పదేళ్ల తర్వాత పని చేస్తున్నారీయన. బాలయ్య సినిమాకు కూడా ఇదే జరుగుతుంది. అఖండ 2 తర్వాత కొత్త సినిమా మొదలుపెట్టడానికి కాస్త టైమ్ తీసుకున్నారు NBK. కానీ గోపీచంద్ మలినేని సినిమా ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లాక అస్సలు ఆగట్లేదు. అప్పుడే ముంబై షెడ్యూల్ పూర్తైపోయింది.. మొన్న జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా విడుదల చేసారు. సినిమాను దసరాకు ప్లాన్ చేస్తున్నారు. సింగ్ గీతం సినిమాను 94 ఏళ్ల వయసులో కేవలం 4 నెలల్లోనే పూర్తి చేసారు సింగీతం శ్రీనివాసరావు. జనవరి 31న మొదలుపెట్టి.. జూన్ 12న విడుదల చేసారు. విజయ్ దేవరకొండ రణబాలి షూట్ కూడా ఈ మధ్యే 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 11న రానుంది. మొత్తానికి సెట్స్‌పైకి వచ్చేందుకు టైమ్ తీసుకున్నా.. వచ్చాక అస్సలు టైమ్ వేస్ట్ చేయట్లేదు మన మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల
Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్ ఏం చెబుతున్నాయి?
పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ
ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..