Pawan Kalyan: OG 2 ఒక్కటేనా.. వాటికి కూడా మోక్షం దొరికేనా..?

Edited By:

Updated on: Jun 14, 2026 | 5:32 PM

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి సినిమాల అప్‌డేట్స్ రావడం కష్టమేనని భావించిన అభిమానులకు OG 2 ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌పై ఆసక్తి పెరుగుతుండగా, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ భవితవ్యంపై కూడా చర్చ మొదలైంది. పవన్ తదుపరి సినిమాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఉన్న బిజీ చూసాక ఆయన నుంచి సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అని అభిమానులు కూడా ఫిక్సైపోయారు.. ఆశలు వదిలేసుకున్నారు కూడా. కానీ అడక్కుండానే అప్‌డేట్ ఇచ్చి వాళ్లలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు ఓజి మేకర్స్. అంతా ఓకే కానీ OG 2 వరకేనా.. మిగిలిన దర్శకులకు కూడా పవన్ ఓకే చెప్తున్నారా..? ఇంతకీ సురేందర్ రెడ్డి పరిస్థితేంటి..? చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా గురించి అప్‌డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తైన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. ఆయన తీరు.. అక్కడ ఆయన జోరు చూసాక ఇప్పట్లో ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ అనుకోకుండా ఓజి 2 అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసారు పవన్ టీం. ఓజి 2 ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. కానీ అదిప్పట్లో ఉంటుందనే ఆశలైతే అభిమానుల్లో లేవు.. పైగా సుజీత్ కూడా నాని సినిమా స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆయన ప్యారడైజ్ నుంచి ఫ్రీ అయ్యాక.. ‘బ్లడీ రోమియో’ను సెట్స్‌పైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సుజీత్. ఈ గ్యాప్‌లోనే ఓజి 2 అప్‌డేట్ వచ్చింది. నాని ప్యారడైజ్‌తోనే మరో ఆర్నెళ్లకు పైగా సావాసం చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే బ్లడీ రోమియో స్క్రిప్ట్ పూర్తి చేసిన సుజీత్.. ప్రస్తుతం ఫారెన్‌లో ఉన్నారు. దాంతో ఆయనొచ్చిన వెంటనే ఓజి 2 పనులు మొదలవుతాయని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ ఓజి 2తో పాటు సురేందర్ రెడ్డి సినిమాను కూడా పవన్ కదిలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓజి ఫ్రాంచైజీపై ముందు నుంచి పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఈ సినిమా వస్తుంది. మరి సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అప్‌డేట్ ఏంటనేది సస్పెన్స్. ఈ సినిమాను పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఇది ఆగిపోలేదని తెలిసినా.. ఎప్పుడు మొదలవుతుందో మాత్రం తెలియదు. మొత్తానికి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల

Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Follow Us