OG యూనివర్స్‌పై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
OG 2 ఉంటుందా..? పవన్ ఇప్పుడున్న బిజీకి ఒక్క సినిమా చేయడానికే టైమ్ లేదు అంటుంటే OG 2 ఉంటుందా అని అడగడం న్యాయమేనా అనుకుంటున్నారు కదా..? మరి ఏం చేస్తాం.. పవన్ ఫ్యాన్స్ కోరిక అంత బలంగా ఉంది మరి. అందుకే దీనిపై పవన్ కూడా క్లారిటీ ఇచ్చేసారు.. అభిమానులకు అదిరిపోయే కబురు చెప్పారు.
OG 2 ముచ్చట్లేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా.. మామూలు ఆడియన్స్ సంగతెలా ఉన్నా.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఓజి సినిమాను మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. చాలా ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ రియల్ స్టైల్ అండ్ స్టామినాను స్క్రీన్ మీద చూపించారు సుజీత్. దాంతో ఆ స్వాగ్, యాక్షన్.. దానికి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా వారం రోజులుగా ఫ్యాన్స్ అంతా ఓ ట్రాన్స్‌లో ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఓజి సీక్వెల్ ఉంటుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. నిజానికి ఓజికి సీక్వెల్ మాత్రమే కాదు.. ప్రీక్వెల్ కూడా ఉందని చెప్పారు సుజీత్. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌కు కనెక్ట్ చేస్తూ ప్రీక్వెల్.. సాహోకు కనెక్ట్ చేస్తూ సీక్వెల్ కథ రాసుకున్నారు సుజీత్. పవన్ ఇచ్చే డేట్స్‌ను బట్టి ప్లాన్ చేస్తానన్నారాయన. ఐడియా బాగానే ఉన్నా.. పవన్ డేట్స్ ఇస్తారా అనేది అనుమానం. కానీ ఓజి 2 ఉంటుందని తేల్చేసారు పవర్ స్టార్. మెగా కుటుంబం కోసం ఓజి స్పెషల్ షో చేసారు.. అక్కడ మాట్లాడుతూ.. ఈ యూనివర్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు పవర్ స్టార్. సుజీత్ వర్క్ తనకు బాగా నచ్చిందన్నారు. అన్నీ కుదిర్తే.. 2026లోనే ఓజి 2 మొదలయ్యే అవకాశాన్ని తీసిపారేయలేం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటి డింపుల్ హయాతిపై PS లో ఫిర్యాదు చేసిన పనిమనుషులు
ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం
చీరకట్టులో పురుషుల గర్బా డ్యాన్స్.. ఎందుకంటే ??
