రూ.100 కోట్లకు ఓకే అంది! కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది..

Updated on: Jun 03, 2025 | 6:05 PM

సమయం, సందర్భం వచ్చినప్పుడు గతంలోని వార్తలు కొన్ని మళ్లీ వైరల్ అవుతుంటాయి. మరోసారి అవి బయటికి వచ్చి నెట్టింట తిరుగుతుంటాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే అలా జరిగిందా అని నివ్వెరపోయేలా చేస్తుంటాయి. ఇప్పుడు నయన్ విషయంలోనూ అదే జరిగింది. గతంలో 100 కోట్లు టెమ్టింగ్ ఆఫర్ ను పక్కన పెట్టి మరీ.. హీరోను కారణంగా చూపుతూ..

నయన్ వదులుకున్న సినిమా తాలూకు న్యూస్ మరోసారి ఆమెను వైరల్ అయ్యేలా చేస్తోంది. సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్‌తో వరుస ఆఫర్లు అందుకుంటున్న నయనతార.. తన క్రేజ్‌ కారణంగా ప్రస్తుతం రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు. ఓ పక్క సినిమాల్లో ఇప్పుడున్న హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూనే.. మరోపక్క బ్రాండ్ ఎండోర్స్‌ మెంట్స్ అండ్ ఇన్‌స్టా డీఎమ్స్‌తో తెగ సంపాదిస్తున్నారు. అలాంటి ఈ బ్యూటీని తన లెజెండ్ సినిమాలో క్యాస్ట్ చేసేందుకు శరవణ స్టోర్‌ అధినేత శరవణ చాలా గట్టిగా ప్రయత్నించాడట. 100 కోట్ల రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశారట. అయితే 100 కోట్ల ఆఫర్ కు నయన్‌ టెమ్ట్‌ అయినట్టు గా న్యూస్ వచ్చినప్పటికీ… హీరోగా శరవణన్‌ చేస్తున్నాడని తెలిసి.. లెజెండ్ సినిమాకు నో చెప్పిందట. మేకర్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. ససేమిరా అంటూ.. కసురుకుందట. దీంతో చేసేదేమీ లేక.. శరవణన్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశిని రంగంలోకి దించాడు. 60 కోట్ల బడ్జెట్‌తో ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శింబుతో రిలేషన్‌కు చెక్ పెట్టింది! లక్కీ గర్ల్‌! లేదంటేనా..?

అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోయిన అలీ- జుబేదా