Actor Naresh 3 Wifes: నరేష్ ముగ్గురు భార్యలు , పిల్లలు ఎవరో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే..!
నరేష్.. యాక్టర్, పొలిటికల్ లీడర్, 'మా' మెంబర్ గా మాత్రమే కాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఎప్పుడూ ఏదో వివాదంతో.. మీడియాలో చెక్కర్లు కొట్టే నరేష్.. తాజాగా తన పర్సనల్ రిలేషన్స్ విషయంలోనూ అబాసుపాలయ్యారు.
నరేష్.. యాక్టర్, పొలిటికల్ లీడర్, ‘మా’ మెంబర్ గా మాత్రమే కాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఎప్పుడూ ఏదో వివాదంతో.. మీడియాలో చెక్కర్లు కొట్టే నరేష్.. తాజాగా తన పర్సనల్ రిలేషన్స్ విషయంలోనూ అబాసుపాలయ్యారు. యాక్టరస్ పవిత్ర తో సన్నిహితంగా మెలిగి.. తన మూడో భ్యార్‌ను మీడియాకెక్కేవరకు తీసుకొచ్చారు. తీరా విషయం వివాదం అవడంతో.. హోటల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో.. వెకిలి చేష్టలు చేస్తూ.. సోషల్ మీడియాలో మరింతగా దిగజారిపోయారు. ఇక ఈ ఇష్యూను పక్కుకు పెడితే.. నరేష్ ఎన్ని పెళ్లిల్లు చేసుకున్నారు.? వారు ఏం చేసేవారు. పిల్లలెంతమంది? అని ఆరా తీసే వారు నెట్టింట ఎక్కువయ్యారు. అయితే ఈ విషయాలపై ఇప్పుడో లుక్కేద్దాం..!
విజయనిర్మల మొదటి భర్తకు కలిగిన సంతానం నరేష్. అయితే విజయనిర్మల తన భర్తకు విడాకులు ఇచ్చి.. సూపర్ స్టార్ కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. కృష్ణ .. నరేష్ ను ఎప్పుడూ సొంత కుమారుడిగా చూసుకున్నారు.. జంధ్యాల నాలుగు స్తంభాలాట సినిమాతో ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు నరేష్. ఇక మొదటి పెళ్లి.. తల్లి విజయనిర్మల చూసిన సంబంధమే.. సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెనే పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ దంపతులకు నవీన్ విజయ్‌కృష్ణ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఇతను సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
మనస్పర్థలు రాడంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన నరేష్.. ఆ తరువాత ప్రముఖ కవి, సినిమా పాటల రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనువరాలు రేఖా సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూడా తేజ అనే కుమారుడు ఉన్నాడు. నరేష్, సుప్రియ కూడా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఇప్పటికీ ఓ ఎన్జీవో సంస్థ కోసం పనిచేస్తూనే ఉన్నట్లు టాక్..
ఇక ముచ్చటగా మూడో పెళ్లి నరేష్ 50 ఏళ్ళు దాటిన అనంతరం.. తనకంటే దాదాపు 20 ఏళ్ళు చిన్నదైన రమ్యను పెళ్లి చేసుకున్నాడు. రమ్య రఘుపతి.. ఆంధప్రదేశ్ మాజీ ఏఐసీసీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు కుమార్తె. వీరికి ఓ కొడుకు కూడా పుట్టారు. కాని ఆ తరువాతే మనస్పర్థలు రావడంతో.. 8 ఏళ్లుగా వేరుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు నరేష్ నాలుగోసారి క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర లోకేష్ ను మహాబలిపురం లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో రమ్య రంగంలోకి దిగి.. తన భర్తకు తనకు విడాకులు ఇవ్వలేదని.. ఇప్పుడు ఎలా పవిత్రను పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తుంది. అంతేకాదు.. తాను తన భర్తకు ఎట్టిపరిస్థితుల్లోనూ విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?