Naresh , Pavitra , Ramya Isuue: పవిత్ర బంధం.. నరేష్ మెడకు చుట్టుకున్నట్టేనా..? రమ్య మాటల్లో నిజం..
ఆయనకు మూడు పెళ్లిళ్లు. ఆమెకు రెండు వివాహాలు. ఇవన్నీ పాత కథలు. ఇప్పుడు వారిద్దరిదీ ఒకే కథ. ఆ కథలోనే ఎన్నో ట్విస్టులు. నరేష్, పవిత్ర లోకేశ్ ఎపిసోడ్‌లో పాత కథలు ఇప్పుడు పీడకలల్లా వెంటాడుతున్నాయి.
ఆయనకు మూడు పెళ్లిళ్లు. ఆమెకు రెండు వివాహాలు. ఇవన్నీ పాత కథలు. ఇప్పుడు వారిద్దరిదీ ఒకే కథ. ఆ కథలోనే ఎన్నో ట్విస్టులు. నరేష్, పవిత్ర లోకేశ్ ఎపిసోడ్‌లో పాత కథలు ఇప్పుడు పీడకలల్లా వెంటాడుతున్నాయి. వస్తా నీ వెనుక అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాలిపోతున్నారు. నరేష్, పవిత్ర రిలేషన్‌ని పబ్లిక్‌లో పెడుతున్నారు. తప్పేంకాదు. ఇది నా ఆవేదన అని చెబుతున్నారు రమ్య రఘుపతి. నా మొగుడు నాకే సొంతం, విడాకులు గిడాకులు జాన్తా నై.. నరేష్ ఉంటే చాలంటున్నారు.ఇక రమ్య మాటల్లో నిజం లేదని అంటున్నారు నరేష్. వేరేవారితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని…తనని బ్లాక్‌మెయిల్ చేస్తోందని…డబ్బు కోసం ఆమె ఈ నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. నరేష్, పవిత్ర మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ అయితే ఇద్దరూ ఒకే హోటల్‌లో ఒకే గదిలో నైట్ అంతా ఎలా ఉన్నారని.. ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు రమ్య. పైగా పవిత్రతో ఓ ఛానెల్ నుంచి స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేయించారు. అందులో తాను నరేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు పవిత్ర చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పైగా ఈ ఇద్దరి కలయికపై ఎప్పటికప్పుడు కన్నేసే ఉంచారు రమ్య. అందులో భాగంగానే మైసూరులోని హోటల్‌లో ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రమ్య.
ఇక నరేష్,మూడో భార్య రమ్య రఘుపతి విడివిడిగా ఉంటున్నారు. ఈ మధ్యలోనే ఆయన పవిత్రతో కలిసి ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వరం వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారని స్టోరీలు నడిచాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వకుండా వాళ్లిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తోంది రమ్య. నరేష్ కుటుంబంతో కలిసి ఉంటున్నానని చెప్పారు పవిత్ర లోకేష్. రమ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్ధంకావడం లేదని అన్నారు. గతవారం రోజుల నుంచి నరేష్ కుటుంబ వ్యవహారం హాట్‌టాపిక్ అయింది. తాజాగా మైసూర్‌లో జరిగిన ఘటనతో మరింత గందరగోళంగా మారింది. మరి ఈ ఎపిసోడ్‌లో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి. ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నరేష్ ఈ మ్యాటర్ ఎలా సెటిల్ చేయబోతున్నారు. రమ్య కాంప్రమైజ్ అవుతుందా లేదా. పవిత్ర పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుతానికి సమాధానం శూన్యమే.. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?