Balakrishna - Sreeleela: బాలయ్య ఆవేశం చూసి.. బోరున ఏడ్చిన  శ్రీలీల.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Balakrishna – Sreeleela: బాలయ్య ఆవేశం చూసి.. బోరున ఏడ్చిన శ్రీలీల.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: May 28, 2023 | 12:48 PM

అది సిల్వర్ స్క్రీన్ పై అయినా.. షూటింగ్ సెట్లో అయినా.. బాలయ్య ను చూసి అందరూ భయపడుతుంటారు. ఆయనతో మాట్లాడాలన్నా.. ఆయనతో మెలగాలన్నా.. కాస్త ఆచితూచి మరీ అడుగులేస్తుంటారు. కానీ అలాంటి బాలయ్యనే చెంప దెబ్బ కొట్టారట టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల..!

అది సిల్వర్ స్క్రీన్ పై అయినా.. షూటింగ్ సెట్లో అయినా.. బాలయ్య ను చూసి అందరూ భయపడుతుంటారు. ఆయనతో మాట్లాడాలన్నా.. ఆయనతో మెలగాలన్నా.. కాస్త ఆచితూచి మరీ అడుగులేస్తుంటారు. కానీ అలాంటి బాలయ్యనే చెంప దెబ్బ కొట్టారట టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల! కొట్టడమే కాదు.. ఆ తరువాత బోరున ఏడ్చారట. పేరుకు స్టార్ హీరో అయినా.. డైరెక్టర్స్ చెప్పింది చేసి.. డైరెక్టర్స్ హీరోగా.. నామ్ కమాయించిన బాలయ్య.. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తాను చేస్తున్న తన 108 ఫిల్మ్ కోసం కూడా అదే చేశారట. హీరోయిన్ శ్రీలీల తన చెంప మీద కొట్టే సీన్‌లో ఎమోషన్ సరిగ్గా సరిపోవడం లేదని అనిల్‌ ఫీలవడంతో… ఆ సీన్‌ కోసం.. బాలయ్య శ్రీలలను నిజంగానే చెంప పై కొట్టమని సీరియస్ గా చెప్పారట. అయితే బాలయ్య కాస్త సీరియస్‌గా చెప్పడంతో.. సీన్‌ కోసం ఆయన చెంప మీద కొట్టేసిన శ్రీలీల.. ఆ తర్వాత ఆయన పెట్టిన రియాక్షన్ చూసి భయంతో.. అక్కడే బోరున ఏడ్చేశారట.అయితే ఇది చూసిన బాలయ్య తో పాటు.. అనిల్ కూడా సీన్ కోసం అప్పడప్పుడూ.. ఇలాంటి తప్పవని చెప్పి ఓదార్చారట. ఆ అమ్మడి భయం పోగెట్టే ప్రయత్నం చేశారట. అయితే ఇదే న్యూస్ తాజాగా ఇండస్ట్రీ నుంచి లీకై.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెట్టింట పాపం శ్రీలీల అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: May 28, 2023 10:00 AM