Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం

Updated on: Mar 14, 2026 | 7:30 PM

మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ సీక్రెట్ వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాపై రూ.10 కోట్ల అప్పు, అరెస్ట్, లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు. దీనిపై మోనాలిసా స్పందిస్తూ, తాము హిందూ ఆచారాల ప్రకారం గుడిలో పెళ్లి చేసుకున్నామని, లవ్ జిహాద్ లేదని స్పష్టం చేశారు. ఆమె అన్ని మతాలను సమానంగా చూస్తానని తెలిపారు.

ప్రేమించిన తన ప్రియుడి ఫర్మాన్ ఖాన్‌తో .. సీక్రెట్ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. తన పెళ్లి వార్తతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఈక్రమంలోనే దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశాడు. మోనాలిసాతో సినిమా తీయడం కోసం ఏకంగా రూ.10 కోట్ల రూపాయల అప్పు చేశానని, ఆమె వ్యవహారశైలి వల్ల తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం వెనుక ‘లవ్ జిహాద్’ కోణం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణలపై మోనాలిసా స్పందించారు. తాము హిందూ ఆచారాల ప్రకారం, హిందూ దేవాలయంలోనే పెళ్లి చేసుకున్నామని.. ఇందులో ఎటువంటి లవ్ జిహాద్ లేదంటూ మోనాలిసా చెప్పారు. అంతేకాదు తాను అన్ని మతాలను సమానంగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌ గడ్డపై నెట్‌ఫ్లిక్స్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్

Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌

Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??

Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా

Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??

Follow Us