అఖండ-2 రిలీజ్‌ ఎఫెక్ట్‌.. బాధలోకి మోగ్లీ డైరెక్టర్

Updated on: Dec 10, 2025 | 3:40 PM

అఖండ 2 విడుదల తేదీ మార్పు టాలీవుడ్‌లో కలకలం రేపింది. డిసెంబర్ 12న రావాల్సిన మోగ్లీ సినిమా అఖండ 2 కారణంగా వాయిదా పడింది. దీనిపై దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ అయ్యారు. కలర్‌ఫోటోతో జాతీయ అవార్డు వచ్చినా, తన పేరును సిల్వర్ స్క్రీన్‌పై చూసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాల ప్రభావంతో చిన్న చిత్రాల కష్టాలకు ఇది అద్దం పడుతోంది.

టాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న చివరి క్షణంలో వాయిదా పడి, మిగతా సినిమాలను ఇబ్బందిలో పెట్టేసింది. ఈ క్రమంలోనే అఖండ2 కి లైన్ క్లియర్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్‌ కానున్నట్టు తెలుస్తోంది. దీంతో మోగ్లీ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. సందీప్ రాజ్‌ డైరెక్షన్లో సుమ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కిన సినిమా మోగ్లీ.. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. అఖండ2 కారణంగా వాయిదా పడింది. దీంతో తానే దురదృష్ట వంతుడిని అంటూ డైరెక్టర్‌ సందీప్ రాజ్‌ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అంతేకాదు కలర్‌ఫోటో మూవీతో నేషనల్ అవార్డు దక్కించుకున్నప్పటికీ.. కనీసం ఇప్పటివరకు తన పేరును సిల్వర్ స్క్రీన్ పై చూసుకోలేదని తన పోస్టులో కోట్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి

మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో

ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి

20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి

ఉద్యోగులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ATM నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా