Mega158 : చిరంజీవి మెగా158 పూజా కార్యక్రమం.. గెస్ట్‌లుగా రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్
Chiranjeevi

Mega158 : చిరంజీవి మెగా158 పూజా కార్యక్రమం.. గెస్ట్‌లుగా రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్

Updated on: May 21, 2026 | 8:24 AM

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఈ కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెగాస్టార్ కెరీర్ లో 158వ సినిమా ఇది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్థార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ లుగా హాజరయ్యారు.

మెగా 158 ఓపినింగ్..

Published on: May 21, 2026 08:22 AM
Follow Us